రష్యాతో యుద్ధంపై జెలెన్‌స్కీ సంచలన వ్యాఖ్యలు?

Chakravarthi Kalyan
రష్యాను దీటుగా ఎదుర్కొంటున్న ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌ స్కీ సంచలన వ్యాఖ్యలు చేసారు. రష్యా జరుపుకుంటున్న విక్టరీ డే పై ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్ స్కీ ఘాటుగా స్పందించారు. త్వరలోనే ఉక్రెయిన్ రెండు విక్టరీ డేలను జరుపుకుంటుందని జెలెన్ స్కీ కామెంట్ చేశారు. ఫాసిజమ్ పై సాధించిన విజయాన్ని స్మరించుకున్న జెలెన్ స్కీ కీవ్ రహదారులపై నడుస్తూ వీడియో సందేశాన్ని రిలీజ్‌ చేశారు. ప్రస్తుతం ఉక్రెయిన్ పై దండయాత్ర చేస్తున్న రష్యా బలగాలను  నాజీ జర్మనీ దళాలుగా జెలెన్ స్కీ వర్ణించారు. ఇప్పటి ఉక్రెయిన్ పై రష్యా యుద్ధానికి.. 1940ల్లో జర్మనీ యుద్ధానికి మధ్య తేడా ఎంటో వివరించారు. తాము కొత్త విజయం కోసం పోరాడుతున్నామన్న జెలెన్‌ స్కీ ఈ దారి చాలా క్లిష్టమైనదన్నారు. అయినప్పటికీ చివరికి తాము గెలుస్తామనడంలో ఎలాంటి సందేహం లేదని జెలెన్‌ స్కీ అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: