గుంటూరోళ్లకు హెచ్చరిక.. నేడు, రేపు జాగ్రత్త?

Chakravarthi Kalyan
గుంటూరు వాసులకు ఇదో హెచ్చరిక.. ఎందుకంటే.. గుంటూరు నగరంలో ఇవాళ, రేపు తాగునీటి సరఫరా నిలిపివేస్తున్నారు. ఈ మేరకు కమిషనర్ చేకూరి కీర్తి ఓ ప్రకటనలో తెలిపారు.  పైపు లైన్ల మరమ్మత్తులు, కొత్త లైన్ల కనెక్షన్లు, స్టోరేజి ట్యాంకుల నిర్వహణ కోసం ఈ పని చేస్తున్నారు. ఈ పనుల కోసం గుంటూరుూ నగరం మొత్తం పూర్తిగా నీటి సరఫరా నిలిపివేస్తున్నారు. బీ ఆర్ స్టేడియం, నల్ల చెరువు, శ్రీనివాసరావు పేట, ఐపీడి కాలనీ రిజర్వాయర్ల పరిధిలో అయితే ఎల్లుండి కూడా నీటి సరఫరా ఉండదు. గుంటూరు వాసులు ఈ విషయాన్ని గుర్తించి సరిపడా నీటిని నిల్వ చేసుకోవాలని సూచించారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చూసుకోవాలని మేయర్ సూచించారు. ఈనెల13వ తేది నుంచి గుంటూరు నగరంలో పూర్తి స్థాయిలో నీటి సరఫరా ఉంటుదని మేయర్ చేకూరి కీర్తి తెలిపారు. ప్రజలు ఈ మరమ్మత్తుల విషయంలో నగర పాలక సంస్థకు సహకరించాలని మేయర్ చేకూరి కీర్తి విజ్ఞప్తి చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: