బ్రేకింగ్ : విద్యావిధానంపై నూత‌న చ‌ట్టం..!

N ANJANEYULU
తెలంగాణ‌లో విద్యావిధానంపై నూత‌న చ‌ట్టాన్ని తీసుకురావాల‌ని క్యాబినెట్ స‌మావేశం నిర్ణ‌యించిన‌ట్టు రాష్ట్ర విద్యాశాఖ‌ మంత్రి స‌బితా ఇంద్రారెడ్డి తెలిపారు. ప్ర‌యివేటు పాఠ‌శాల‌లు, క‌ళాశాల‌లు, డిగ్రీ క‌ళాశాల‌లో ఫీజుల నియంత్ర‌ణ, వ‌చ్చే విద్యా సంవ‌త‌్స‌రం నుంచి ప్ర‌భుత్వ పాఠ‌శాల‌లో ఇంగ్లీషు మీడియంలో విద్యా బోధ‌న‌కు.. నూత‌న చ‌ట్టాన్ని తీసుకురావాల‌ని క్యాబినెట్ నిర్ణ‌యించింది అని మంత్రి వెల్ల‌డించారు. ముఖ్యంగా ఈ రెండు అంశాల‌పై పూర్తి అధ్య‌య‌నం చేసి సంబంధిత విధి, విధానాల‌ను రూపొందించ‌డానికీ క్యాబినెట్ స‌బ్ క‌మిటీనీ ఏర్పాటు చేసిన‌ట్టు తెలిపారు మంత్రి.
విద్యాశాఖ‌ మంత్రి స‌బితా ఇంద్రారెడ్డి అధ్య‌క్ష‌త‌న మంత్రులు కేటీఆర్‌, కొప్పుల ఈశ్వ‌ర్‌, త‌ల‌సాని శ్రీ‌నివాస్‌యాద‌వ్‌, నిరంజ‌న్‌రెడ్డి, శ్రీ‌నివాస్‌గౌడ్‌, జ‌గ‌దీశ్‌రెడ్డి, హ‌రీశ్‌రావు, ప్ర‌శాంత్‌రెడ్డి, పువ్వాడ అజ‌య్‌కుమార్‌, ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్‌రావు స‌భ్యులుగా క్యాబినెట్ స‌బ్ క‌మిటీలో ఉంటారు. వ‌చ్చే శాస‌న‌స‌భా స‌మావేశాల‌లో దీనికి సంబంధించిన కొత్త చ‌ట్టాన్ని తీసుకురావాల‌ని క్యాబినెట్ నిర్ణ‌యించింద‌ని స‌బితా స్ప‌ష్టం చేసారు. అదేవిధంగా రూ.7289 కోట్ల‌తో మ‌న ఊరు-మ‌న బ‌డి ప్ర‌ణాళిక కోసం క్యాబినెట్ ఆమోదం తెలిపిన‌ట్టు  మంత్రి స‌బితా వెల్ల‌డించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: