వైఎస్సార్ : చిత్తూరు జిల్లాలో విగ్ర‌హం ధ్వంసం.. డిప్యూటీ సీఎం ఫైర్‌

N ANJANEYULU
ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి డాక్ట‌ర్ వైఎస్ రాజ‌శేఖ‌ర్‌రెడ్డి విగ్ర‌హాన్ని గుర్తు తెలియ‌ని వ్య‌క్తులు ధ్వంసం చేసారు. చిత్తూరు జిల్లాలోని ఎస్‌.ఆర్‌.పురం మండ‌లంలో ఈ ఘ‌ట‌న చోటు చేసుకున్న‌ది. ఇప్పుడు స్థానికంగా ఈ ఘ‌ట‌న క‌ల‌క‌లం సృష్టిస్తూ ఉంది. ముఖ్యంగా వైసీపీ నేత‌లు, కార్య‌క‌ర్త‌లు ఘాటుగా స్పందించారు.
చిత్తూరు జిల్లాలో ఉన్న‌టువంటి ఎస్.ఆర్‌.పురం మండ‌లంలో వైఎస్సార్ విగ్ర‌హాన్ని ఎవ‌రో గుర్తు తెలియ‌ని దుండ‌గులు దాడి చేసార‌ని.. ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. ఎస్‌.ఆర్‌.పురం మండ‌ల కార్యాల‌యం ముందు ఉన్న రాజ‌శేఖ‌ర్‌రెడ్డి విగ్ర‌హం చేతి భాగం, ముఖమును గుర్తు తెలియ‌ని దుండ‌గులు ప‌గుల‌గొట్టారు. దీంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్త‌త ప‌రిస్థితి నెల‌కొంది. వైఎస్ విగ్ర‌హంపై దాడికి య‌త్నించిన వారికీ క‌ఠిన శిక్ష వేయాల‌ని.. వైసీపీ కార్య‌క‌ర్త‌లు, నేత‌లు ధ‌ర్నా నిర్వ‌హించారు. ఈ విష‌యం తెలుసుకున్న డిప్యూటీ సీఎం నారాయ‌ణ స్వామి, ఆర్టీసీ వైస్ చైర్మ‌న్ విజ‌య‌నందారెడ్డి ఘ‌ట‌న స్థ‌లానికి చేరుకున్నారు. ఈ ఘ‌ట‌న‌పై డిప్యూటీ సీఎం  నారాయ‌ణ‌స్వామి మండిప‌డ్డారు. ఇలాంటి ఘ‌ట‌న‌లు జ‌రుగుతుంటే.. పోలీసులు ఏమి చేస్తున్నారు అని నారాయ‌ణ స్వామి నిల‌దీసారు. ఇలాంటి ఘ‌ట‌న‌లకు పాల్ప‌డితే.. తోలు తీస్తాం అని హెచ్చ‌రించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: