ఏడు కొండల వాడి సేవలో.....


వైకుంఠ ఏకాదశి పర్వదినాన్నిపురస్కరించుకుని  గురువారం తెలుగు రాష్ట్రాలలో వేడుకలు ఆంభమయ్యాయి. ముఖ్యంగా వైష్ణవాలయాలు భక్తులతో కిటికిటలాడుతున్నాయి. ప్రధాన దేవాలయాల్లో కోవిడ్-19 వ్యాప్తి కారణంగా ఆంక్షలు విధించారు. తిరుమల లోని శ్రీ వేంకటేశ్వర స్వామిని దేశం లోని వివిధ ప్రాంతాలకు చెందిన భక్తులు దర్శించుకున్నారు.  దాదాపు రెండు వేల మందకి పైగా వివిఐపిలు  కొండల రాయుడి దర్శనం చేసుకున్నారు. వారిలో కొందరు ప్రముఖలు ఎవరంటే ?
తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి తో పాటు, పలువురు న్యాయమూర్తులు కుటంబ సమేతంగా దర్శనం చేసుకున్నారు. తెలుగు రాష్ట్రాల మంత్రులు  దాదాపు పది మందికి పైగా కోనేటి రాయుడిని దర్శించుకున్నట్లు సమాచారం. భారత్ బయోటెక్ అధినేతలు కృష్ణ ఎల్లా,  సుచిత్రా ఎల్లా లు స్వామి వారిని దర్శించుకున్నారు. టిటిడి ఆధ్వర్యం లోని ఎస్.వి.బి.సి ట్రస్లు, అన్నదానం ట్రస్టుకు రెండు కోట్ల రూాయలు విరాళంగా ఇచ్చారు. స్వామి వారి రంగ నాయక మండపంలో విరాళానికి సంబంధించిన చెక్కును టిటిడి చైర్మన్ సుబ్బా రెడ్డి, ఈవోలకు అందజేశారు.
 తెలంగాణ మంత్రులు హరీష్ రావు దంపతులు,  గంగుల కమలాకర్ దంపతులు స్వామి వారిని దర్శించుకున్నారు. ఇక ఆంధ్ర ప్రదేశ్ చెందన ప్రముఖుల జాబితాలోకి వస్తే మంత్రులు  వెల్లపంల్లి శ్రీనివాస్, అనిల్ కుమార్ యాదవ్,  నారాయణ స్వామి జయరామ్, రంగనాథ రాజు, సురేష్, బాలినేని, అవంతి తదితరులు హాజరయ్యారు.  నందమూరి లక్ష్మి పార్వతి, రోజ... అలా రాసుకుంటూ పోతే  శ్రీనివాస ప్రభువును దర్శించుకున్న ప్రముఖుల జాబితా చాలా  పెరుగుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

ttd

సంబంధిత వార్తలు: