ఓమిక్రాన్ ... పరీక్షలు వాయిదా ?


కోవిడ్-19 తాజా వేరియంట్  ఓమిక్రాన్ భారత్ లో విశ్వరూపం ప్రదర్శిస్తుండటంతో దాని ప్రభావం వివిధ ప్రాంతాలలో పడుతోంది. దేశం లోని పలు రాష్ట్రాలు ఇప్పటికే చాలా ఆంక్షలు విధించాయి. ఈ కోవలోనే ఆంధ్ర ప్రదేశ్ పొరుగు రాష్ట్రాలైన తెలంగాణ, కర్ణాటకలు చాలా ఆంక్షలు విధించాయి. అదే బాటలో తమిళనాడు ప్రభుత్వం కూడా కఠినంగా వ్యవహరిస్తోంది.  ఆ రాష్ట్రంతాజాగా తీసుకున్న చర్య ఏమిటో తెలుసా ?
తమిళనాడులో కరోనా మహమ్మరి తీవ్రరూపం దాల్చడంతో అక్కడి ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. తమిళనాడు రాజధాని నగరం చెన్నై తో పాటు ఆ రాష్ట్రం లోని ప్రధాన నగరాలలో రాత్రి వేళ కర్ఫ్యూ విధించారు. ప్రభుత్వ కార్యాలయాలు యాభై శాతం సిబ్బందితో పనిచేస్తున్నాయి. తాజా గా ఆ రాష్ట్ర ప్రభుత్వం ఓ సంచనమైన నిర్ణయాన్ని ప్రకటించింది. జనవరి 20న ప్రారంభం కావాల్సిన అన్ని యూనివర్సిటీ ఎండ్ సెమిస్టర్ పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు తమిళనాడు ఉన్నత విద్యాశాఖ మంత్రి కె. పొన్ముడి ప్రకటించారు. రాష్ట్రంలో కోవిడ్-19 ఇన్‌ఫెక్షన్లు పెరుగుతున్నందున షెడ్యూల్ చేసిన పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు మంత్రి సోమవారం మీడియా ప్రతినిధులతో చెప్పారు. పరీక్షలకు వారం రోజుల ముందు కొత్త తేదీలను ప్రకటిస్తామని ఆయన తెలిపారు. ప్రభుత్వ ప్రకటనను ఉల్లంఘించిన  ఏ సంస్థ అయినా పరీక్షలు నిర్వహిస్తే,  కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: