వర్మ vs పేర్ని... వార్ బిగినైంది.


ఆంధ్ర ప్రదేశ్ మంత్రి పేర్ని నానీతో సినీదర్శకుడు రామ్ గోపాల్ వర్మ భేటీ అయ్యారు. ఆంధ్ర ప్రదేశ్ లో ప్రభుత్వం సినిమా టికెట్లు తగ్గించడం పై గత కొంత కాలంగా వివాదం నడుస్తోంది. ఈ నేపథ్యంలో  సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ, రాష్ట్ర మంత్రి పేర్ని నానీ ల  మధ్య సామాజికమాధ్యమాల్లో వార్ జరిగింది. ఈ క్రమంలో మంత్రితో భేటీ అయ్యేందుకు రామ్ గోపాల్ వర్మ ఆంధ్ర ప్రదేశ్ కు వచ్చారు. ఇంతకీ విరిద్దరూ ఏం మాట్లాడుకుంటారో తెలుసు కదా మీకు ?
గత వారం రోజులుగా మీడియా జనానికి మంచి వార్తల పండగ. సినీ నిర్మాత రామ్ గోపాల్ వర్మ, ఆంధ్ర ప్రదేశ్ కు  చెందిన మంత్రి మధ్య వాటల యుద్దం జరిగింది.ఆ తరువాత అది సామాజిక మాధ్యమాల్లో ఒకరికొకరు ప్రశ్నలు సంధించుకున్నారు. ఎవరి సమాధానాలు వారివి. ఈ క్రమంలో రామ్ గోపాల్ వర్మ తనకు అపాయింట్ మింట్ ఇస్తే నేరుగా వచ్చి మాట్లాడతానని పేర్ని నానీకి తెలిపారు. అందుకు ఆయన సమ్మతించి నేడు కలవాల్సిందిగా కోరారు. ఇదంతా సమాజిక మాధ్యమాల్లోనే జరగడం విశేషం.దీంతో రామ్ గోపాల్ వర్మ మంత్రి కార్యాలయానికి వచ్చారు. అక్కడ ఉన్న మీడియా తో వర్మమాట్లాడారు. సినిమా టికెట్ల ధరలు తగ్గించే విషయంలో ఎవరి అభిప్రాయాలు వారివని  ఆయన అన్నారు. ఇతరుల వ్యాఖ్యలపై తాను స్పందిచనని పేర్కోన్నారు. తాను ఒక ఫిల్మ్ మేకర్ గానే మంత్రి మాట్లాడటానికి వచ్చానని, ఇతరులతో తనకు సంబంధం లేదని రామ్ గోపాల్ వర్మ తనను కలసిన విలేఖరుల వద్ద వ్యాఖ్యానించారు. వాళిద్దరూ ఎం మాట్లాడుకున్నారనే విషయం పై మనం తొందర పడనవసరం లేదనుకుంటా. ఎందుకో తెలుసుగా.. వర్మ ఎప్పటి కప్పుడు సమాజిక మాధ్యమాలలో తన అభిప్రాయాలను పంచుకుంటారు. నో ...డిలే ప్లీజ్

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: