ఎట్టా వచ్చిందబ్బా....సంసద్ పై కరోనా పడగ...బడ్జట్ వాయిదా పడే అవకాశం


భారత సర్వోన్నత  చట్టసభ సంసద్ అదేనండి పార్లమెంట్ పై కరోనా పడగ వేసింది.  పార్ల్ మెంట్ ఉభసభల సిబ్బనంది తో పాటు అనుబంధ  విభాగాలపైన కూడా కరోనా ప్రభావం భారీగానే పడింది. నూతన సంవత్సరంలో  భారత్ లో కరోనా కెసులు విపరీతంగా పెరుగుతున్నాయి. భారత పార్లమెంట్ భవనంలో ఎంత మందికి కరోనా సోకిందో తెలిస్తే మీరు నివ్వెర పోతారు.
భారత పార్లమెంట్ లో రాజ్యసభ, లోక్ సభ రెండు విభాగాలుంటాయి. ఇవి కాక ఇతర విభాగాలు కూడా ఉంటాయి. ఈ భవనంలో దాదాపు  పద్నాలుగు వందల మందికి పైగా పని చేస్తున్నారు. వీరిలో ప్రస్తుతం మూడ వంతుల మందికి పైగా కరోనా సోకినట్లు అధికార వర్గాల సమాచారం. దాదాపు నాలుగు వందల మందికి కరోనా సోకిందని, ఉన్నత స్థాయి అధికారులు కూడా ఐసోలేషన్ లో ఉన్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. రాజ్యసభ సిబ్బందిలో 69 మంది,లోక్ సభ సిబ్బ్ందిలో రెండువందల మంది కరోనా బారిన పడ్డారు. వీరే కాక ఇతర శాఖలకు చెందిన మరో ఎనభై మందికి కూడా కరోనా సోకినట్లు సమాచారం. ప్రభుత్వ ఉద్యోగులను యాభై శాతం మంది మాత్రమే హాజరు కావాలని ప్రభుత్వం అదేశాలు జారీ చేసింది. ఈ ప్రభావం ఎంత కాలం ఉంటుందనే విషయమై పార్లమెంట్ అధికారులు సమాలోచనలు జరుపుతున్నారు.  ఇదే పరిస్థితి కొనసాగితే పార్లమెంట్ బడ్జట్ సమావేశాలు వాయిదా పడే అవకాశం ఉందని పార్లమెంట్ అధికారులు తెలిపారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: