నైట్ క‌ర్ప్యూపై క్లారిటీ ఇచ్చిన సీఎం

N ANJANEYULU
దేశ‌వ్యాప్తంగా ఓవైపు క‌రోనా కేసులు, మ‌రొక‌వైపు ఒమిక్రాన్ కేసుల విజృంభ‌ణ కార‌ణంగా ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో నైట్ క‌ర్ప్యూ అమ‌లులోకి వ‌చ్చిన‌ద‌ని వార్త‌లు వినిపించాయి. మరొక‌వైపు 50 శాతం ఆక్యుపెన్సీ అంటూ పలు మెసెజ్‌లు, వాట్సాప్‌, సామాజిక మాధ్య‌మాల‌లో వార్త‌లు తెగ వైర‌ల్ అవుతున్నాయి. దీనిపై తాజాగా ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం ఓ క్లారిటీ ఇచ్చింది. రాష్ట్రంలో నైట్ కర్ప్యూ లేదు అని అధికారులు స్ప‌ష్టం చేసారు. సోష‌ల్ మీడియా వేదిక‌గా త‌ప్పుడు ప్ర‌చారం, మేసెజ్‌లు స‌ర్య్యూలేషన్ చేసే వారి గురించి ఆరా తీస్తున్నాం అని పేర్కొన్న‌ది.
అస‌త్య‌ప్ర‌చారాలు చేసే వారిపై చ‌ట్ట‌ప‌ర‌మైన చ‌ర్య‌లు తీసుకుంటాం అని అధికారులు హెచ్చ‌రిక‌లు జారీ చేస్తున్నారు. రోజు రోజుకు కేసులు పెరుగుతున్నా ప్ర‌తీ ఒక్క‌రూ క‌రోనా నిబంధ‌న‌లు పాటించాల‌ని అధికారులు సూచిస్తున్నారు. ముఖ్యంగా ఎప్ప‌టిక‌ప్పుడు మాస్క్ ధ‌రించడంతో పాటు సోష‌ల్ డిస్టెన్స్ పాటించి.. ప్ర‌తి అర‌గంట‌కు ఒకసారి చేతుల‌ను శానిటైజ్ చేసుకోవాల‌ని వైద్యులు సూచిస్తున్నారు. ఎవ్వ‌రూ వ్యాక్సిన్ తీసుకోకుండా నెగ్లెట్ చేయ‌కూడ‌దు అని పేర్కొంటున్నారు వైద్యులు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: