బహుపరాక్ : నిబంధనలు మారుతున్నాయ్...


కోవిడ్-19 తాజా వేరియంట్ ఓమిక్రాన్ భారత్ లో తన ప్రతాపాన్ని చూపుతున్న వేళ ప్రయాణీకులు తగు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంది.  కోరోనా మహమ్మారి భారత్ లో ప్రవేశించిన నాటి నుంచి ప్రభుత్వం తో పాటు పలు స్వచ్ఛంద సంస్థలు, వివిధ ప్రభుత్వ రంగ సంస్థలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై  ఎప్పటి కప్పడు సూచనలు చేస్తూనే ఉన్నారు. తాజాగా  రైల్వే ఒక నిబంధన విధించింది. అది ఏమిటో తెలుసా?
ఇప్పటి వరకూ విమాన ప్రయాణీకులకు, అది కూడా విదేశాల నుంచి భారత్ లోకి వచ్చే వారికి  కోవిడ్ నిబంధలు కఠినంగా అమలు చేస్తోంది భారత ప్రభుత్వం. విదేశాల నుంచి ఇండియాలో ప్రవేశించే వారు తప్పని సరిగా వారం రోజుల పాటు క్వారంటైన్ ఉండాలని తాజా నిబంధనలు సూచిస్తున్నాయి.
కాగా రైల్వే శాఖ కూడా  ప్రయాణీకులకు కొన్ని ఆంక్షలు విధించ నుంది. తొలుతగా  హుబ్లీ కేంద్రంగా నడిచే సౌత్ వెస్ట్రన్ రైల్వే  తాజాగా ఆంక్షలు విధించింది. ఇవి దేశవ్యాప్తంగా త్వరలోనే అమలు చేయనున్నట్లు రైల్వే శాఖ అధికారులు పేర్కోంటున్నారు. సౌత్ వెస్ట్రన్ రైల్వే తాజా ఆంక్షలు ఏమిటంటే.. గోవానుంచి కర్ణాటక లోని వివిధ ప్రాంతాలకు నిత్యం ప్రయాణించే వారుకానీ, అప్పడప్పుడూ ప్రయాణించే ప్రయాణీకులు కానీ తప్పని సరిగా ఆర్.టి.పి.సి.ఆర్ నెగటివ్ రిపోర్టును చూపించాల్సి ఉంటుంది. క్రమం తప్పకుండా ప్రయాణించే వారు, సీజనర్లు కూడా ప్రతి పదిహేను రోజులకు ఒక సారి  తాజాగా తీసుకున్న ఆర్.టి.పి.సి.ఆర్ నెగటివ్ రిపోర్టును  సంబంధిత అధికారులకు చూపించాల్సి ఉంటుంది. ఈ నిబంధనలు తక్షణం అమలులోకి వస్తాయని సౌత్ వెస్ట్రన్ రైల్వే తెలిపింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: