కోవిడ్ ఉగ్ర‌రూపం.. డాక్ట‌ర్ల‌ను వ‌ద‌ల‌ని వైనం..!

N ANJANEYULU
భార‌త్‌లో మ‌ళ్లీ కరోనా మ‌హ‌మ్మారి ఉగ్ర‌రూపం దాల్చిన‌ది. రోజు వారి కేసుల సంఖ్య మ‌ళ్లీ 90వేల‌కు పైగా దాటింఇ. ఇదే స‌మ‌యంలో క‌నిపించ‌ని మ‌హ‌మ్మారితో ముందుండి పోరాటం చేసే వైద్యులు సైతం పెద్ద సంఖ్య‌లో క‌రోనా బారిన‌ప‌డుతున్నారు. ఇప్ప‌టికే మ‌హారాష్ట్ర రాజ‌ధాని అయిన ముంబైలో 230 మంది డాక్ట‌ర్ల‌కు క‌రోనా పాజిటివ్ సోకిన విష‌యం విధితమే. అయితే తాజాగా ముంబైలోని సియోన్ ఆసుప‌త్రిలో మ‌రొక 30 మంది వైద్యుల‌కు క‌రోనా సంభ‌వించింది.
దీంతో ముంబై న‌గ‌రంలో వైర‌స్ బారిన ప‌డిన‌టువంటి రెసిడెంట్ డాక్ట‌ర్ల సంఖ్య 260కి చేరుకుంది. మ‌హారాష్ట్ర రెసిడెంట్స్ డాక్ట‌ర్స్ అసోసియేష‌న్ ప్ర‌క‌టించిన‌ది. వీరంద‌రూ నాలుగు రోజుల వ్య‌వ‌ధిలోనే వైర‌స్ బారీన ప‌డ‌డం క‌ల‌క‌లం రేకెత్తిస్తున్న‌ది. ముంబైలోని వివిధ ఆసుప్ర‌తుల‌లో ఉన్న వైద్యులంద‌రూ వైర‌స్ కోర‌ల్లో చిక్కుకుంటున్నార‌నే ఆందోళ‌న వ్య‌క్త‌మ‌వుతోంది. ఒక‌వైపు క‌రోనా.. మ‌రొక‌వైపు ఒమిక్రాన్ వైర‌స్‌లు విరుచుకుప‌డుతున్న స‌మ‌యంలో వైద్యులు మ‌హ‌మ్మారి బారిన ప‌డ‌టం ఆందోళ‌న‌కు గురి చేస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: