కాపులపై బీజేపీ ఎంపీ జీవీఎల్ ఏమ‌న్నారంటే..?

N ANJANEYULU
ఏపీలో కుల రాజ‌కీయం కొత్తేమి కాదు.. కానీ మ‌రొక‌సారి కుల‌రాజ‌కీయం తెర‌పైకి వ‌స్తుంది. తాము అంటే తామే అని ప్ర‌క‌టిస్తున్నారు నేతలు. తాజాగా బీజేపీ ఎంపీ జీవీఎల్ న‌ర‌సిహారావు కాపుల‌పై కీల వ్యాఖ్య‌లే చేసారు. కాపు సామాజిక వ‌ర్గం రాజ‌కీయంగా  న‌ష్ట‌పోయింద‌ని పేర్కొన్నారు. కాపుల‌కు న్యాయం జ‌రిగేది కేవ‌లం బీజేపీతోనే అని ప్ర‌క‌ట‌న చేశారు. ప్ర‌జాగ్ర‌హ స‌భ త‌రువాత టీడీపీ, వైసీపీల గుండెల్లో రైళ్లు ప‌రుగెట్టాయ‌ని చెప్పుకొచ్చారు ఆయ‌న‌. బీజేపీది స‌బ్ కా స‌త్ స‌బ్ కా వికాస్ అనే నినాదంతో అభివృద్ధికి కృషి చేస్తున్న‌ద‌ని వెల్ల‌డించిన జీవీఎల్‌. ఏపీకే కేంద్రం విస్తృతంగా నిధులు స‌మ‌కూర్చింది. కేంద్రం ఇచ్చిన ప్ర‌యోజ‌నాల‌పై గుడ్డ క‌ప్పే ప్ర‌య‌త్నం జ‌రుగున్న‌ద‌ని ఆరోపించారు న‌ర‌సింహారావు.
పార్ల‌మెంట్‌లో టీడీపీ, వైసీపీ మాకు సానుకూలంగా ఉన్నాయ‌ని  ఎంపీ జీవీఎల్ గుర్తు చేసారు. మ‌రొక‌వైపు ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వంపై ఆయ‌న తీవ్ర విమ‌ర్శ‌లు చేశారు. స్టీల ప్లాంట్‌, పోల‌వ‌రం వంటి అంశాల‌పై ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ అడిగిన‌ట్టు ఎక్క‌డా విన‌లేదు అని ఆరోపించారు. రాష్ట్ర ప్ర‌భుత్వం చేతులు ఎత్తేస్తే పోల‌వరం ప్రాజెక్ట్‌ను మేమే నిర్మిస్తాం అన్నారు. రాష్ట్రంలో జ‌రిగే ప్ర‌తీ అభివృద్ధి కేంద్రానిదే అని స్ప‌ష్టం చేసారు. విభ‌జ‌న హామీల అమ‌లు, ప్రాజెక్టుల ప‌నితీరు ప‌రిశీల‌న కోసం బీజేపీ ఎంపీ జీవీఎల్ విశాఖ ప‌ట్ట‌ణంలో ప‌ర్య‌టిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: