దేశంలో భారీగా పెరిగిన కరోనా కేసులు..మ‌ర‌ణాలు ఎన్నంటే..?

N ANJANEYULU
దేశంలో క‌రోనా మ‌హ‌మ్మారి రోజు రోజుకు భీక‌ర రూపం దాల్చుతుంది. క‌రోనా కేసులు వెలుగులోకి వ‌చ్చాయి. గ‌త 24 గంట‌ల్లో 58,097 కేసులు న‌మోదు అయ్యాయి. ఈ వైర‌స్ ప్ర‌భావంతో 534 మంఇ ప్రాణాలు కోల్పోయారు. ఇది ఇలా ఉండ‌గా.. మ‌రొక వైపు 15,389 మంది కోలుకున్నారు. దేశంలో రోజు వారి పాజిటివిటీ రేటు 4.18 శాతంగా ఉన్న‌ద‌ని కేంద్ర వైద్య‌, ఆరోగ్య‌శాఖ స్ప‌ష్టం చేసిన‌ది.
 
భార‌త్ దేశంలో 2,14, 004 యాక్టివ్ కేసులు ఉన్నాయి. దేశంలో ఇప్ప‌టివ‌ర‌కు 3,43,21,803 మంది క‌రోనా నుంచి కోలుకున్నారు. కొవిడ్ ధాటికి మొత్తంగా 4,82,551 మంది మ‌ర‌ణించారు. దేశంలో టీకా పంపిణీ శ‌ర‌వేగంగా కొన‌సాగుతున్న‌ది.  మంగ‌ళ‌వారం మ‌రొక 96,43,238 డోసులు అందించారు. దీనితో ఇప్ప‌టివ‌ర‌కు పంపిణీ చేసిన టీకా డోసుల సంఖ్య 147.72 కోట్ల‌కు చేరుకున్న‌ది. దేశ‌వ్యాప్తంగా కొవిడ్ కేసులు మ‌ళ్లీ పెరుగుతున్న త‌రుణంలో ప్ర‌భుత్వ‌, ప్ర‌యివేటు ఆసుప‌త్రుల్లో ప‌డ‌క‌ల సంఖ్య‌లను పెంచాల‌ని ఇప్ప‌టికే కేంద్ర‌వైద్యారోగ్య‌శాఖ రాష్ట్రాలు, కేంద్ర‌పాలిత ప్రాంతాల‌కు సూచ‌న‌లు కూడా జారీ చేసింది.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: