అక్కడ వీకెండ్ కర్ఫ్యూ... ఎప్పటి నుంచి అంటే ?


ఎరువు వేసిన పైరు లాగా రోజు రోజుకు పెరుగుతున్న కరోనా వ్యాధిని నివారించడానికి ఆ రాష్ట్రం చేసిన ప్రయత్నాలు ఆశించినంత మేర సఫలం కాలేదు. దీంతో అక్కడి ప్రభుత్వోద్యోగులకు వర్క్ ఫ్రం హోం వెసులుబాటు ఇచ్చారు. అయినా ఫలితం లభించ లేదు. మూడు రోజుల్లో కేసులు  పది వేలకు పైగా నమోదయ్యాయి.దీంతో గత్యంతరం లేక  అక్కడ వీకెండ్ కర్ఫ్యూ ప్రకటించారు. ఎక్కడో తెలుసా ?
 దేశ రాజధాని నగరం ఢిల్లీ కరోనా మహమ్మారి మరో దఫా ప్రళయ గర్జనతో అట్టుడికి పోతోంది.  వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉండటంతో ఆ రాష్ట్రం ఇప్పటికే ఎల్లో జోన్ గా ఉంది. కాని పరిస్థితి చేయిదాటే పరిస్థితి కనిపించడంతో  ఢిల్లీ సర్కారు తక్షణ చర్యలు చేపట్టింది. వీకెండ్ లలో పూర్తి స్థాయిలో కర్ఫ్యూను అమలు చేయాలని నిర్ణయించింది. ఈ విషయాన్ని ఆ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియా  ప్రకటించారు. తక్షణం ఈ నిర్ణయం అములు లోకి వస్తుందని తెలిపారు. ఈ శుక్రవారం  రాత్రి పది గంటల నుంచి సోమవారం ఉదయం ఐదు గంటల వరకూ పూర్తి స్థాయిలో కర్ఫ్యూ ఉంటుందని  చెప్పారు. అందరూ సహకరించాలని మనీష్ సిసోడియా విజ్ఞప్తి చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: