కేంద్ర‌మంత్రికి క‌రోనా పాజిటివ్‌..!

N ANJANEYULU
క‌రోనా మ‌హ‌మ్మారీ ఎవ్వ‌రీనీ వ‌ద‌ల‌డం లేదు. ప్ర‌జ‌లు, రాజ‌కీయ నాయ‌కులు, సినీ ప్ర‌ముఖులు ఇలా వారు వీరు అని తేడా లేకుండా అంద‌రికీ సోకుతుంది. తాజాగా కేంద్ర‌భారీ ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి మ‌హేంద్ర‌నాథ్ పాండే(65)  కోవిడ్‌-19 పాజిటివ్‌గా తేలింది. దీంతో ఆయ‌న ఆసుపత్రిలో చేరారు. చందౌళి నియోజ‌క‌వ‌ర్గం నుంచి బీజేపీ ఎంపీగా ఉన్నారు. పాండే గ‌తంలో కూడా క‌రోనా సంభ‌వించింది. నేను గ‌త రెండు రోజులుగా అనారోగ్యంతో ఉన్నాను. అనారోగ్యంగా ఉండ‌డం వ‌ల్ల అనుమానం వ‌చ్చి క‌రోనా ప‌రీక్ష చేయించుకున్నాను. వెలువ‌డిన రిపోర్టులో క‌రోనా పాజిటివ్‌గా నమోదు అయింది.
గ‌త కొద్ది రోజులుగా నన్ను సంప్ర‌దించిన వారంద‌రూ త‌మ‌ను తాము జాగ్ర‌త్త‌గా చూసుకోవాల‌ని, అదేవిధంగా అవ‌స‌ర‌మైన ప‌రిశోధ‌న‌లు చేయాల్సిందిగా మంత్రి ట్వీట్ చేసారు.  ముందు జాగ్ర‌త్త‌గా ఆసుప‌త్రిలో అడ్మిట్ అయ్యాన‌ని, ప్ర‌స్తుతం ఆరోగ్యం నిల‌క‌డ‌గానే ఉంద‌ని వివ‌రించారు మంత్రి.  కౌశాంబిలోని య‌శోద ఆసుప‌త్రిలో చేరారు మంత్రి మ‌హేంద్ర‌నాథ్ పాండే. క‌రోనా ప్రోటోకాల్ కింద అత‌నికి చికిత్స ప్రారంభించారు. మంత్రి ఆరోగ్యానికి సంబంధించిన నివేదిక‌ను జిల్లా చీఫ్ మెడిక‌ల్ ఆఫీస‌ర్‌కు పంపించామ‌ని ఆసుప‌త్రి మెడిక‌ల్ సూప‌రింటెండెంట్ అనుజ్ అగ‌ర్వాల్ ఓ ప్ర‌క‌ట‌లో పేర్కొన్నారు. కేంద్ర మంత్రి కోసం ప్ర‌త్యేకంగా వైద్యుల బృందాన్ని నియ‌మించిన‌ట్టు వెల్ల‌డించారు.
 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: