భారీ ప్ర‌మాదం : కాలి బూడిదైన థియేట‌ర్..!

N ANJANEYULU
హైద‌రాబాద్ న‌గ‌రంలో అర్థ‌రాత్రి భారీ అగ్ని ప్ర‌మాదం చోటు చేసుకుంది. ఈ ఘ‌ట‌న‌లో ఓ థియేట‌ర్ మొత్తం కాలి బూడిద అయింది. వివ‌రాల్లోకి వెళ్లితే.. కూక‌ల్‌ప‌ల్లి  కేపీహెచ్‌బీకాల‌నీ స‌మీపంలో ఉన్న శివ‌పార్వ‌తి థియేట‌ర్‌లో ఉన్న‌ట్టుండి  అర్థ‌రాత్రి వేళ‌లో  అక‌స్మాత్తుగా అగ్నిప్ర‌మాదం సంభ‌వించింది. అయితే మంట‌లు చెల‌రేగ‌డంతో థియేట‌ర్ అంటుకోవ‌డంతో వెంట‌నే సిబ్బంది ఫైర్ స్టేష‌న్‌కు కాల్ చేసారు. వెంట‌నే స్పందించిన ఫైర్ సిబ్బంది థియేట‌ర్ వ‌ద్ద‌కు చేరుకుని 3 ఫైర్ ఇంజ‌న్ల సాయంతో మంట‌ల‌ను అదుపులోకి తీసుకొచ్చారు.
అయితే రాత్రి స‌మ‌యం కావ‌డంతో భారీ ప్ర‌మాదం త‌ప్పిన‌ది. సినిమా స‌మ‌యంలో ప్ర‌మాదం సంభ‌విస్తే మాత్రం పెను ప్ర‌మాద‌మే సంభ‌వించి ఉండేది. ప్రాణ‌న‌ష్టం కూడా బారీగానే ఉండేది. క్ష‌ణాల వ్య‌వ‌ధిలోనే థియేట‌ర్ మొత్తం మంట‌లు వ్యాపించ‌డంతో అందులో ఉన్న ఫ‌ర్నిచ‌ర్ అంతా ద‌గ్దమైంది. శివ‌పార్వ‌తి థియేట‌ర్‌లో నాని న‌టించిన శ్యామ్‌సింగ‌రాయ్ సినిమాను ప్ర‌ద‌ర్శిస్తున్నారు. ఆదివారం సెకండ్ షో పూర్త‌యిన త‌రువాత ఈ ప్ర‌మాదం జ‌రిగింది. ఈ ఘ‌ట‌న‌పై పోలీసులు కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తును వేగ‌వంతం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: