శుభ‌వార్త : ఇక నుంచి వారికి ఉచిత ప్ర‌యాణం..!

N ANJANEYULU

తెలంగాణ ఆర్టీసీ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్న‌ది. త్వ‌ర‌లో కొత్త ప‌థం ప్ర‌వేశ‌పెట్టేందుకు టీఎస్ ఆర్టీసీ స‌మాయ‌త్తమ‌వుతుంది. తెలంగాణ 12 ఏండ్ల‌లోపు చిన్నారులంద‌రూ శాశ్వ‌తంగా ఉచితంగా ప్ర‌యాణించే విధంగా చ‌ర్య‌లు తీసుకుంటున్నాం అని టీఎస్ ఆర్టీసీ చైర్మ‌న్ బాజీరెడ్డి గోవ‌ర్థ‌న్ ప్ర‌క‌టించారు. ఈ నిర్ణ‌యం అమ‌లులోకి వ‌స్తే పిల్ల‌ల‌తో పాలు వారి త‌ల్లిదండ్రులు కూడా ఆర్టీసీ బ‌స్సుల‌లో ప్ర‌యాణించేందుకు మొగ్గు చూపుతారు అని ఆయ‌న అభిప్రాయ ప‌డ్డారు. ఆర్టీసీ బ‌స్సుల్లో ఆక్యుపెన్సీ పెరుగుతుంద‌ని బాజీరెడ్డి ఆకాంక్షించారు.
నూత‌న సంవ‌త్స‌రం సందర్భంగా హైద‌రాబాద్ బ‌స్ భ‌వ‌న్‌లో శ‌నివారం వేడుక‌ల‌ను నిర్వ‌హించారు. వేడుక‌ల్లో ఆర్టీసీ చైర్మ‌న్ బాజీరెడ్డి గోవ‌ర్థ‌న్‌రెడ్డితో పాటు ఆర్టీసీ ఎండీ స‌జ్జ‌నార్ కూడా పాల్గొన్నారు. కేకు క‌ట్ చేసి ఆర్టీసీ కార్మికులు, ఉద్యోగుల‌కు వారు శుభాకాంక్ష‌లు తెలిపారు. అనంత‌రం ఆర్టీసీ చైర్మ‌న్ మాట్లాడారు. కొత్త ప‌థ‌కం గురించి ప్ర‌క‌ట‌న చేసారు. నూత‌న సంవ‌త్స‌రం సంద‌ర్బంగా 12 ఏండ్ల లోపు చిన్నారులు ఆర్టీసీ బ‌స్సుల్లో ఉచితంగా ప్ర‌యాణించ‌వ‌చ్చు అని ఇటీవ‌లే ఆర్టీసీ ఎండీ స‌జ్జ‌నార్ ప్ర‌క‌టించిన విష‌యం విధిత‌మే. అయితే ఇవాళ చైర్మ‌న్ అధికారికంగా ప్ర‌క‌టించారు.
 



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: