బ్రేకింగ్ : మంచు మ‌నోజ్‌కు కరోనా పాజిటివ్‌

N ANJANEYULU
క‌రోనా మ‌హ‌మ్మారీ కాస్త త‌గ్గిన‌ట్టే త‌గ్గి మ‌ర‌ల విజృంభ‌న మొద‌లెట్టింది. పేద‌, ధ‌నిక, సాధార‌ణ‌, అసాధార‌ణ‌, సెల‌బ్రిటీలు ఎవ్వ‌ర‌నీ తేడా లేకుండా అంద‌రికీ ఏదో ఒక రూపంలో క‌రోనా సంభ‌విస్తూనే ఉన్న‌ది. తాజాగా సినీ హీరో మంచు మ‌నోజ్‌కు కొవిడ్‌-19 సోకింది. అత‌నికి అక‌స్మాత్తుగా క‌రోనా పాజిటివ్ రావడంతో గ‌త వారం రోజులుగా న‌న్ను క‌లిసిన ప్ర‌తీ ఒక్క‌రూ వెంట‌నే ప‌రీక్షించుకోవాల‌ని సూచించారు.
అదేవిధంగా క‌రోనా ప‌రీక్ష‌లు నిర్వ‌హించుకోవ‌డంతో పాటు అందుకు అవ‌స‌ర‌మైన జాగ్ర‌త్త‌లు కూడా తీసుకోవాల‌ని అభ్య‌ర్థిస్తున్న‌ట్టు ట్వీట్ చేసారు మంచు మ‌నోజ్‌. ముఖ్యంగా నా గురించి ఎవ్వ‌రూ చింతించ‌కండి. మీ అంద‌రి ప్రేమ, మ‌రియు అభిమానాలు, ఆశీర్వాదాలతో నేను ప్ర‌స్తుతం బాగానే ఉన్నాను అని చెప్పారు. అయితే త‌న‌కు చికిత్స అందిస్తున్న డాక్ట‌ర్లు, న‌ర్సులంద‌రికీ ప్ర‌త్యేకంగా ధ‌న్యవాదాలు చెప్పారు హీరో మంచు మ‌నోజ్. అదేవిధంగా కరోనా సమయంలో జాగ్రత్తగా చూసుకుంటున్న డాక్ట‌ర్లు.. న‌ర్సులు కూడా ఆరోగ్యంగా ఉండాల‌ని కోరారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: