ఏపీ డీజీపీకి చంద్ర‌బాబు లేఖ‌.. ఎందుకంటే..?

N ANJANEYULU
ఇటీవ‌ల వంగ‌వీటీ రాధా త‌న‌ను హ‌త్య చేసేందుకు రెక్కీ నిర్వ‌హించార‌ని చేసిన సంఛల‌న‌ వ్యాఖ్య‌లు ఏపీలో పెద్ద దుమారాన్నే లేపాయి. ఈ త‌రుణంలో వంగ‌వీటి రాధాకు ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం భ‌ద్ర‌త క‌ల్పించ‌నున్న‌ట్టు కూడా వార్త‌లు వినిపించాయి. ఈ త‌రుణంలో టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్ర‌బాబునాయుడు డీజీపీ గౌత‌మ్ స‌వాంగ్‌కు ఓ లేఖ రాసారు. వంగ‌వీటి రాధా హ‌త్య‌కు జ‌రిగిన రెక్కీపై స‌మ‌గ్ర విచార‌ణ చేప‌ట్టాల‌ని చంద్ర‌బాబ‌ను కోరారు.
దోషుల‌పై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని.. లేఖ‌లో డిమాండ్ చేసారు. రాధాకు ఏమి జ‌రిగినా ప్ర‌భుత్వానిదే బాధ్య‌త అని.. ఏపీలో శాంతిభ‌ద్ర‌త‌లు ప‌రిస్థితి భ‌యంక‌రంగా ఉన్న‌ద‌ని చంద్ర‌బాబు లేఖ‌లో పేర్కొన్నారు. బెదిరింపుల ప‌రంప‌ర‌లోవంగ‌వీటి రాధాను ల‌క్ష్యంగా చేసుకున్నారు అని పేర్కొన్నారు. ఇలాంటి చ‌ర్య‌లు అట‌వీక పాల‌న‌ను త‌లిపిస్తూ ఉన్నాయ‌ని.. హింసాత్మ‌క ఘ‌ట‌న‌ల‌పై కూడా చ‌ర్య‌లు లేక‌పోవ‌డంత ఈ త‌ర‌హా ఘ‌ట‌న‌లు చోటు చేసుకుంటున్నాయ‌ని  చంద్ర‌బాబు లేఖ‌లో తెలిపారు. అయితే చంద్ర‌బాబు డీజీపీ రాసిన లేఖ‌పై డీజీపీ ఏవిధంగా స్పందిస్తారో వేచి చూడాలి మ‌రీ.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: