బీసీసీఐ చీఫ్ గంగూలీకి కరోనా పాజిటివ్

N ANJANEYULU
భార‌త క్రికెట్ నియంత్రణ మండ‌లి అధ్య‌క్షుడు సౌర‌వ్ గంగూలీకి క‌రోనా పాజిటివ్ సోకింది. గ‌త రెండు, మూడు రోజుల నుంచి కాస్త నీర‌సంగా ఉండ‌డంతో బీసీసీఐ అధ్య‌క్షుడు క‌రోనా ప‌రీక్ష‌లు చేయించుకున్నారు. దీంతో ఆయ‌న‌కు పాజిటివ్ వ‌చ్చిన‌ట్టుగా తేలిన‌ది. ప్ర‌స్తుతం ఆయ‌న కోల్‌క‌త్తాలోని వుడ్ ల్యాండ్స్ ఆసుప‌త్రిలో చేరి చికిత్స పొందుతున్నట్టు స‌మాచారం. గంగూలి ఆరోగ్యం పై అభిమానులు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు.
ముఖ్యంగా సోమ‌వారం రాత్రి బీసీసీఐ చీఫ్ సౌర‌వ్ గంగూలీకి కొవిడ్ నిర్థార‌ణ నిర్వ‌హించగా.. వెలువ‌డిన రిపోర్టులో క‌రోనా పాజిటివ్‌గా న‌మోదైంది. గంగూలీకి క‌రోనా సోక‌డం ఇదే మొద‌టి సారి. గ‌తంలో ఐపీఎల్ 2021కు కొన్ని రోజుల ముందు గంగూలీ కుటుంబ స‌భ్యులు క‌రోనా బారీన ప‌డ్డారు. కానీ గంగూలీకి సోక‌లేదు అప్పుడు. తాజాగా గంగూలీ కొవిడ్‌-19 బారీన ప‌డ్డ‌ట్టు వైద్యులు నిర్థారించారు. ఈ ఏడాది ప్రారంభంలో టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ గంగూలీ ఆసుప్ర‌తిలో చేరారు. ముఖ్యంగా గంగూలీకి ఛాతి నొప్పి రావ‌డంతో ఆస్ప‌త్రిలో చేరి..యాంజియోప్లాస్టీ చికిత్స‌ను వైద్యులు చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: