అన్‌స్టాపబుల్ విత్ ఎన్బీకే : ఈనాటికి ఏ నాటికి తెలుగు సినిమా త‌గ్గేదేలే..!

N ANJANEYULU
నంద‌మూరి బాల‌కృష్ణ మూవీల‌తో పాటు చిన్న తెర‌పై కూడా వ్యాఖ్యాత‌గా బ‌హుముఖ ప్ర‌జ్ఞ‌తో ముందుకెళ్లుతున్నాడు. ఇదివ‌ర‌కు త‌న అభిమానులు, ప్రేక్ష‌కులు ఎవ్వ‌రూ చూడ‌ని త‌న‌లో ఉన్న మ‌రొక యాంగిల్ ను పాపుల‌ర్ సెలెబ్రిటీ టాక్ షో అన్‌స్టాప‌బుల్ విత్ ఎన్‌బీకే  అంటూ దూసుకెళ్లుతున్నారు. తెలుగు ఓటీటీ ఆహా ఫ్లాట్‌ఫామ్‌లో ప్ర‌సారం అవుతున్న ఈ షో అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల‌ను ఎంత‌గానో ఆక‌ట్టుకుంటుంది.
ఈ షోలో తాజాగా 6వ ఏపిసోడ్‌లో పుష్ప టీమ్ ఎంట్రీ ఇచ్చింది. ఈ నాటికి ఏనాటికి తెలుగు సినిమా త‌గ్గేదే లే అని బాల‌య్య ఎంట్రీ ఇచ్చారు. సుకుమార్ ఎంట్రీ రాగానే ముఖ్యంగా  డైరెక్ట‌ర్ ల‌తో ఇదే గొడ‌వ.. సినిమాల్లో అలాగే ఉంటాయి. వీరి గెట‌ప్‌లు అదేవిదంగా ఉంటాయ‌ని అని ఇద్ద‌రు ముచ్చ‌టించారు. నాకు మ్యాథ్స్ రెండు ఫార్ములాలు వ‌చ్చు అని చెప్పారు బాల‌య్య‌.  క‌మ‌ర్షియ‌ల్ సినిమాలు చేసే అవ‌కాశం ఉందా..? 3 నెల‌ల్లో బొమ్మ ప‌డాలి అని సుకుమార్‌ను అడిగారు. బన్నీ చంద‌నం, ర‌ష్మిక చంద‌మామ అని పేర్కొన్నారు. నా సామి సాంగ్ లో సుకుమార్, ర‌ష్మిక‌ల‌తో క‌లిసి బాల‌య్య ఢ్యాన్స్ చేసారు. మీ చేత ఢ్యాన్స్ చేయించిన వాడిని మూడు నెల‌ల్లో సినిమా చేయించ‌లేనా అని పేర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: