బ్రేకింగ్ : క్షణికావేశం తీసింది ప్రాణం.. ఎక్కడంటే ?


ఇద్దరు పోలీసుల మధ్య ఏర్పడిన వివాదం ఒకరి ప్రాణం తీసింది. ఈ ఘటన తెలంగాణ రాష్ట్రంలో ములుగు జిల్లాలో జరిగింది. ఈ జిల్లా పరిధిలోని వెంకటాపురం వద్ద సిఆర్ పిఎఫ్ సిబ్బంది మధ్య ఏర్పడిన వాదోపవాదాలు చివరికి తుపాకి కాల్పల వరకూ వెళ్లాయి. ఒకరి పై మరోకలు కాల్పులకు పాల్పడటంతో ఒక వ్యక్తి అక్కడి కక్కడే మృతి చెందారు. మరోకరు ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు. అందిన సమాచారం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. సిఆర్ పిఎఫ్ బెటాలియన్ 29 కి చెందన ఇద్దరు సిబ్బంది, వారిలో ఒకరు కానిస్టేబుల్, మరొకరు ఎస్సై గా పని చేస్తున్నారు. వీరిరువురి మధ్య ఆదివారం ఉదయం వివాదం తలెత్తింది. సీబ్బందికి భోజనం తయారు చేసే విషయంలో ఇద్దరి మధ్య వాదనలు జరిగాయని, తరువాత అవి పెరిగి పెద్దమయ్యాయని అక్కడి సిబ్బంది తమ పై అధికారులకు తెలిపారు. ఈ బెటాలియన్ లో దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన వారు విధులు నిర్వర్తిస్తున్నారు. అక్కడో బీహార్ కు చెందిన ఎస్సైగా ఉన్నారు. తమిళనాడుకు చెందిన కానిస్టేబుల్ స్టీఫెన్ కూడా పని చేస్తున్నారు. కాగా అక్కడి మెస్ కు స్టీఫెన్ ఇన్ చార్జిగా ఉన్నారు. ఈ ఉదయం వేకువన మెస్ లో వంట వండే అంశం పై ఇద్దరి మధ్య వివాదం తెలెత్తింది. ఇద్దరూ కూడా ఒకరి పై మరోకరు కాల్పులు జరుపుకున్నారు. ఈ ఘటనలో ఎస్సై ఉమేశ్ చంద్ర ఘటనా స్థలంలో అక్కడికక్కడే మరణించారు. గాయపడిన కానిస్టేబుల్ ను సమీపంలో ని ఆసుపత్రికి తరలించారు. మోరుగైన వైద్యం కోసం అతనిని మరోక ప్రాంతానికి తరలించనున్నట్లు సమాచారం. కానిస్టేబుల్ స్టీఫెన్ కు కూడా తన భాగంలో బుల్లెట్ గాయాలయ్యాయని అక్కడి సిబ్బంది ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: