పోస్ట‌ర్‌తో ట్రెండింగ్‌లో 'రామారావు ఆన్ డ్యూటీ'

N ANJANEYULU
మాస్ మ‌హారాజా ర‌వితేజ హీరోగా రూపొందిస్తున్న నూత‌న యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ రామారావు ఆన్ డ్యూటీ ప్ర‌స్తుతం ఈ సినిమా షూటింగ్ చివ‌రి ద‌శ‌లో ఉన్న‌ది. తాజాగా అంద‌రికీ క్రిస్మ‌స్ శుభాకాంక్ష‌లు తెలుపుతూ.. మేక‌ర్స్ నూత‌న పోస్ట‌ర్ ను విడుద‌ల చేసారు. కొత్త ద‌ర్శ‌కుడు శ‌ర‌త్ మండ‌వ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ సినిమా క్రిస్మ‌స్ పోస్ట‌ర్‌లో ర‌వితేజ‌ను చూపించిన విధానం అంద‌రినీ ఎంత‌గానో ఆక‌ట్టుకుంటున్న‌ది. ర‌వితేజ ఓ వృద్ధ దంప‌తుల‌కు న‌గ‌దు ఇస్తూ.. ఉల్లాసంగా క‌నిపిస్తున్నాడు. వారి ముఖాల‌లో ఆనందాన్ని మనం ఇట్టే చూడ‌వ‌చ్చు.
కేవ‌లం పోస్ట‌ర్ కార‌ణంగానే రామారావు ఆన్ డ్యూటీ ఇవాళ మార్నింగ్ నుంచి ఇది ట్విట్ట‌ర్‌లో ట్రెండింగ్ అవుతుంది. ఇత‌రుల‌కు ఆనందాన్ని అందించ‌డం నిజ‌మైన సంతృప్తినిస్తుంది.  ర‌వితేజ ఈ పోస్ట‌ర్ ద్వారా సినిమాలో త‌న నిజ‌మైన పాత్ర‌ను చూపించిన‌ట్టు తెలుస్తోంది. దివ్యాంశ కౌశిక్‌, ర‌జిషా విజ‌య‌న్‌, క‌థానాయిక‌లుగా న‌టిస్తున్న ఈ యాక్ష‌న్ సినిమాలో తొట్టంపూడి  కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్నారు. ఎస్ఎల్వీ సినిమాస్ ఎల్ఎల్పీ, ఆర్టీ టీమ్ వ‌ర్క్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి సామ్ సీఎస్ సంగీతాన్ని అందించారు. రామారావు ఆన్ డ్యూటీ 2022 మార్చి 25న వెండి తెర‌పై రానున్న‌ది.

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: