సీఎం రిలీఫ్ ఫండ్ తో ధాన్యం కొనుగోలు చేయాలి : రేవంత్ రెడ్డి

N ANJANEYULU
తెలంగాణ పీసీసీ చీఫ్‌గా బాధ్య‌త‌లు చేప‌ట్టిన త‌రువాత ఇవాళ రేవంత్‌రెడ్డి వికారాబాద్ జిల్లా కొడంగ‌ల్‌లో ప‌ర్య‌టించారు. గ‌తంలో కొడంగ‌ల్ నుంచి టీడీపీ త‌రుపున  రేవంత్‌ రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు.   సొంత నియోజ‌క‌వ‌ర్గమైన కొడంగ‌ల్‌లో ప‌ర్య‌టించి.. మీడియాతో మాట్లాడారు రేవంత్‌రెడ్డి. తెలంగాణ రైతులు పండిస్తున్ వ‌రిపంట‌ను సీఎం స‌హాయ‌నిధితో కొనుగోలు చేయాల‌ని డిమాండ్ చేసారు. కేంద్రంలో మోడీ వ‌రి వ‌ద్దు అంటున్నాడ‌ని.. తెలంగాణ‌లో సీఎం కేసీఆర్ అదే అంటున్నాడ‌ని మండిప‌డ్డారు రేవంత్‌రెడ్డి.
సెప్టెంబ‌ర్‌లో  సీఎం కేసీఆర్‌..  ప్ర‌ధాని మోడీని క‌లిసి వ‌చ్చిన త‌రువాత ఇంత‌వ‌ర‌కు ఏ కేంద్ర‌మంత్రి ద‌గ్గ‌ర అపాయింట్‌మెంట్ తీసుకోలేదు అని ఫైర్ అయ్యారు.  కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాల వైఖ‌రి మూలంగా తెలంగాణ రైతులు మ‌ర‌ణిస్తున్నార‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేసారు పీసీసీ చీఫ్‌. వెంట‌నే ధాన్యం కొనుగోలు చేయాల‌ని.. అదేవిధంగా కొవిడ్ స‌మ‌యంలో తెలంగాణ రాష్ట్రంలో అవినీతి భారీగా జ‌రిగింద‌ని ఆరోప‌ణ‌లు చేసారు రేవంత్‌రెడ్డి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: