హైదరాబాద్​- విజయవాడ హైవేపై ప్రమాదం.. ట్రాఫిక్ జామ్‌..!

N ANJANEYULU
హైద‌రాబాద్‌-విజ‌య‌వాడ జాతీయ ర‌హ‌దారిపై నిత్యం రోడ్డు ప్ర‌మాదాలు చోటు చేసుకూనే ఉంటుంటాయి. మామూలుగా రోడ్డు ప్ర‌మాదాలు సంభ‌వించిన‌ప్పుడు.. పండుగ‌ల స‌మ‌యంలో ఆ జాతీయ ర‌హదారి ర‌ద్దీగా క‌నిపిస్తుంటుంది. తాజాగా రోడ్డు ప్ర‌మాదం సంభ‌వించ‌డంతో కూడా కిలోమీట‌ర్ల దూరం వ‌ర‌కు ర‌ద్దీగా క‌నిపించింది ఇవాళ ఉద‌యం.
న‌ల్ల‌గొండ జిల్లా చిట్యాల మండ‌లం పెద్ద‌కాప‌ర్తి వ‌ద్ద జాతీయరహదారిపై యూటర్న్ చేస్తుండగా లారీని ఒక్క‌సారిగా రెండు కార్లు ఢీ కొట్టడంతో ప్ర‌మాదం సంభ‌వించిన‌ది. ఈ ప్ర‌మాదంలో ముగ్గురికి తీవ్ర గాయాలు కావ‌డంతో వెంట‌నే వారిని ఆసుప‌త్రికి త‌ర‌లించారు. జాతీయరహదారిపై సోమ‌వారం అక‌స్మాత్తుగా చోటు చేసుకున్న  ప్రమాదంతో వాహ‌నాలు భారీగానే నిలిచాయి. హైదరాబాద్‌-విజయవాడ మార్గంలో 2 కిలోమీట‌ర్ల మేర వ‌ర‌కు వాహ‌నాలు నిలిచిపోయాయి. దీంతో ఆ మార్గం గుండా వెళ్లే వారు  ఇవాళ గంట‌ల కొద్ది నిరీక్షించాల్సి వ‌చ్చింది.   కొద్ది సేప‌టి త‌రువాత పోలీసులు అక్క‌డికి చేరుకుని ట్రాఫిక్‌ను క్లియ‌ర్ చేసేందుకు సిద్ధం చేసారు. ముఖ్యంగా వాహ‌నాలు అక్క‌డ రోడ్డుకు అడ్డంగా ఉండ‌డంతో రాక‌పోక‌ల‌కు అంత‌రాయ‌మేర్ప‌డింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: