జవాద్‌ తుఫాన్‌ ఎఫెక్ట్.. 120 రైళ్లు రద్దు..!

N ANJANEYULU
జవాద్ తుఫాన్‌ దూసుకొస్తుండడంతో రైల్వే శాఖ అధికారులు  ముంద‌స్తుగానే అప్రమత్తమ‌య్యారు.  ఈస్ట్‌ కోస్ట్ రైల్వేతో పాటు దక్షిణ మధ్య రైల్వే కూడా పలు రైళ్లను రద్దు చేసిన‌ది. ఈస్ట్‌ కోస్ట్ రైల్వే ఏకంగా 120 రైళ్లను రద్దుచేసాం అని అధికారులు వెల్లడించారు. డిసెంబ‌ర్ 2 నుంచే కొన్ని రైల్వే సర్వీసులు రద్దు అయిన విషయం విధిత‌మే.  నిన్న శుక్ర‌వారం కూడా కొన్ని రైళ్లు పట్టాలే ఎక్కలేదు. ఇవాళ కూడా కొన్ని రైళ్లు స్టేషన్లకు మాత్ర‌మే పరిమితం కానున్నాయి. ఈ నెల 5వ‌ తేదీ వరకు  ఈస్ట్‌ కోస్ట్‌ రైల్వే  వాల్తేరు రైల్వే డివిజన్‌ మీదుగా ప్రయాణించే 120 రైళ్లను రద్దు చేసిన‌ది.  మరోవైపు పలాస మీదగా రాక పోకలు సాగించే రైళ్లను కూడా రద్దు చేసారు.
జవాద్ తుఫాన్ కారణంగా ఆంధ్రా-ఒడిశా సరిహద్దులో పలాస, శ్రీకాకుళం మీదుగా ప్రయాణించే  పలు రైళ్లను రద్దు  చేసామ‌ని ఈస్ట్ కోస్ట్ రైల్వే ఖుర్దా డివిజన్ అధికారులు ప్రకటించారు.  రైల్వే ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు శ్రీకాకుళం జిల్లా మీదుగా శనివారం రాక‌పోక‌లు కొన‌సాగించాల్సిన‌ ఎక్స్‌ప్రెస్, సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్, వీక్లీ, స్పెషల్ ట్రైన్స్, పాసింజర్ రైళ్లను నిలిపి వేసిన‌ట్టు రైల్వే అధికారులు వెల్లడించారు. 18463 భువనేశ్వర్- ప్రశాంతి, రైలు నెంబర్ 18637 హటియా -బెంగళూరు కాంట్, రైలు నెంబర్ 22819 భువనేశ్వర్ -విశాఖపట్నం, రైలు నెంబర్ 17015 భువనేశ్వర్- సికింద్రాబాద్, 18418 గుణుపూర్- పూరి, 12807 విశాఖపట్నం -నిజాముద్దీన్ సమతా ఎక్స్‌ప్రెస్, 18551 విశాఖపట్నం- కిరండూల్ సహా పలు రైళ్లను  రైల్వేశాఖ ర‌ద్దు చేసిన‌ది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: