వెల "సిరి" : వేటూరితో పోలిక వ‌ద్దు గాక వ‌ద్దు

RATNA KISHORE

సినిమా పాట రాయ‌డం వేగంతో రాయ‌డం ఇవ‌న్నీ కొన్ని సందిగ్ధిత‌లు.. ఆయ‌న వేగంగా రాసి పేరు తెచ్చుకున్నారు.. ఓ పాట వేగంగా రాయ‌డ‌మే ప్రామాణికం అయితే అందుకు నాకు అర్హ‌త లేద‌నే అంటాను అని అంటారు సిరివెన్నెల ఓ సంద‌ర్భంలో..చేసే ప‌నిలో అర్థం తెలుసుకుని చేయ‌డం తాత్విక‌త.. ఓ చోట అంటారాయ‌న.. అలాంటి తాత్విక చింత‌న‌ల‌తోనే పాట‌లు రాశారు.. బూడిదిచ్చే వాణ్ని ఏమి అడ‌గాలి..వాడు ఆదిభిక్షువు వాడిని ఏమి అడ‌గాలి..అన్న నిందాస్తుతి ఆయ‌న‌దే! ముక్కంటి ముక్కోపి తిక్క శంకరుడు అని స్తుతిస్తూనే నిందిస్తూనే పాట రాయ‌డంలో ఔన్న‌త్యం ఉంది. దృక్కు ఉంది వాక్కు ఉంది.. సినిమా క‌వికి ఇవి అవ‌స‌ర‌మా అంటే ప్రాథ‌మికంగా క‌వి అన్న మాట‌కే ఇవ‌న్నీ అవ‌స‌రం అన్న అర్థం ఒక‌టి ఆయ‌న విష‌య‌మై చాలా మంది చెబుతారు. ఆ విధంగా ఆయ‌న సిస‌లు క‌వి సినిమా క‌వి. అశ్లీలం చొర‌బ‌డ‌నీయ‌ని ఆ చొర‌వ తీసుకునే అవ‌కాశం ఉన్నా తీసుకోని ఆంక్ష‌ల క‌వి..ఓ విధంగా తెలుగు సినిమా పాట‌కు ఆయ‌న ఆఖ‌రి నిబ‌ద్ధాక్ష‌రి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: