వెల 'సిరి' : సీతారామశాస్త్రి మృతి పట్ల ఏపీ సీఎం జగన్ సంతాపం..

N ANJANEYULU
ప్రముఖ సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి మృతి పట్ల ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన ప్రగాఢ సానుభూతిని ప్ర‌క‌టించారు.  సిరివెన్నెల మృతి సినీ ప్రపంచానికి తీరని లోటని  పేర్కొన్నారు.  తెలుగు సినీ గేయ ప్రపంచంలో విలువల శిఖరం సిరివెన్నెల అని.. అక్షరాలతో ఆయన చేసిన భావ విన్యాసాలు తెలుగువారి చరిత్రలో ఎప్పటికీ చిరంజీవులుగా నిలిచి ఉంటాయని కొనియాడారు సీఎం జ‌గ‌న్‌.  ఆయ‌న మ‌ర‌ణం తెలుగువారికి తీరనిలోటని ట్వీట్ చేశారు ఏపీ సీఎం.  సిరివెన్నెల సీతారామశాస్త్రిగారి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్న‌ట్టు ప్ర‌క‌టించారు జ‌గ‌న్‌.
సిరివెన్నెల సీతారామశాస్త్రి సికింద్రాబాద్‏లోని కిమ్స్ ఆసుపత్రిలో న్యూమోనియాకు చికిత్స పొందుతూ ఇవాళ సాయంత్రం తుదిశ్వాస విడిచారు. గత కొద్ది రోజులుగా ఆయన న్యూమోనియాతో బాధపడుతూనే ఉన్నారు.  ఈనెల 24 తీవ్ర అస్వస్థతకు గురై సీతారామశాస్త్రిని సికింద్రాబాద్‏లోని కిమ్స్ ఆసుపత్రిలో జాయిన్ చేసారు. అప్పటి నుంచి ఆయనకు ఐసీయూలోనే చికిత్స పొందారు. ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్‏ మరింత తీవ్రం కావ‌డం మూలంగా  ఇవాళ కన్నుమూశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: