రాజ్యసభ నుంచి విపక్ష ఎంపీల వాకౌట్‌..!

N ANJANEYULU
12 మంది రాజ్యసభ ఎంపీల సస్పెన్షన్‌ వ్యవహారం  ప్ర‌స్తుతం పార్లమెంట్‌ సమావేశాలను కుదిపేస్తోంది.  పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాల‌లో అనుచితంగా ప్రవర్తించినందుకు 12 మంది రాజ్యసభ సభ్యులపై సస్పెన్షన్‌ వేటు వేసారు రాజ్యసభ ఛైర్మన్ వెంక‌య్య‌నాయుడు. శీతాకాల సమావేశాల నుంచి కూడా మొత్తంగా సస్పెండ్‌ చేస్తూ నిర్ణయం తీసుకోవడంపై విపక్ష ఎంపీలు అభ్యంతరం వ్యక్తం చేసారు.
అయితే ఎంపీలు ఫూలో దేవి నేత, ఛాయా వర్మ, రిపున్‌ బోరా, రాజమణి పటేల్, సయ్యద్‌ నాసిర్‌ హుస్సేన్, అఖిలేశ్‌ ప్రసాద్‌ సింగ్‌, డోలా సేన్, శాంతా చెత్రి, ప్రియాంక చతుర్వేది, అనిల్‌ దేశాయ్‌, ఎలమారమ్‌ కరీమ్‌, బినయ్‌ విశ్వంపై సస్పెన్షన్‌ ఎత్తివేయాలంటూ విపక్షాలు చేసిన విజ్ఞప్తిని చైర్మన్‌ వెంకయ్యనాయుడు తిర‌స్క‌రించారు. ఇందుకు  నిరసనగా రాజ్యసభ నుంచి టీఆర్ఎస్‌ సహా మిగతా ప్రతిపక్షాల సభ్యులు వాకౌట్ చేసారు. 12మంది రాజ్యసభ సభ్యులపై సస్పెన్షన్ ఎత్తివేయాలన్న విపక్షాల విజ్ఞప్తిని చైర్మన్ అంగీకరించకపోవడంతో సభ నుంచి వాకౌట్ చేశారు. అనంతరం పార్లమెంట్ ఆవరణలోని గాంధీ విగ్రహం ముందు విప‌క్ష నేత‌లు ఆందోళన చేపట్టారు.




మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: