ఓమిక్రాన్: రంగంలోకి జగన్, ఆ కేంద్రాలు మళ్లీ ఓపెన్

N ANJANEYULU
 ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి క‌రోనా క‌ట్ట‌డి కోసం తీసుకోవాల్సిన చ‌ర్య‌ల‌పై ఆరా తీసారు. కొత్త వేరియంట్ ఓమిక్రాన్ పరిస్థితుల‌పై సీఎం అన్ని జిల్లాల క‌లెక్ట‌ర్‌ల‌తో వీడియో కాన్ఫ‌రెన్స్ నిర్వ‌హించ‌నున్నారు. అయితే విదేశాల నుంచి రాష్ట్రానికి వ‌చ్చిన వారి వివ‌రాలు, వారిలో ఎవరికైనా పాజిటివ్ తేలిందా లేదా..?  రెండోసారి ఆర్టీపీసీఆర్ టెస్టులు చేశారా అనే  విషయాల‌పై  వివరణ కోరే అవకాశం క‌నిపిస్తోంది. అదేవిధంగా క్వారంటైన్‌, వైద్య ప‌రీక్ష‌ల‌పై కూడా ఆరా తీసారు.

ముఖ్యంగా విదేశాల నుంచి రాష్ట్రానికి వ‌చ్చిన వారి వివ‌రాల‌ను ఎప్ప‌టిక‌ప్పుడూ తెలుసుకోవాల‌ని సీఎం సూచించే అవ‌కాశం తెలుస్తోంది. అదేవిధంగా అన్ని జిల్లాల‌లో ఆర్‌టీపీసీఆర్ కేంద్రాల‌ను తిరిగి పున‌రుద్ధ‌రించాల‌ని ఆదేశాలు ఇవ్వ‌నున్నారు సీఎం జ‌గ‌న్‌. వాటికి కావాల్సిన కిట్లు, రియోజెంట్లను ఇవ్వాల్సిందిగా సీఎం వైద్యశాఖకు సూచించనున్నారు. ఇప్ప‌టికే ప్రతిరోజు జిల్లా కేంద్రాల్లో మూడు వంద‌ల మందికి ఆర్టీపీసీఆర్ విధానంలో టెస్టులు చేసేందుకు ఏర్పాట్లు చేసుకోవాలని సీఎం  ఆదేశించిన‌ట్టు స‌మాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: