పెన్ష‌న్ దారుల‌కు తెలంగాణ ప్ర‌భుత్వం శుభ‌వార్త‌..!

N ANJANEYULU
తెలంగాణ రాష్ట్రంలో ఉన్న‌టువంటి పెన్ష‌న‌ర్ల పీఆర్సీ బ‌కాయిల‌ను వ‌చ్చే సంవ‌త్స‌రం జ‌న‌వ‌రి నుంచి చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన‌ది. 36 సమాన వాయిదాల్లో బకాయిలను చెల్లించేందుకు ఆర్థిక శాఖ శుక్రవారం జీవో నెంబ 1406ను జారీ చేసిన‌ది.  2020 పీఆర్సీ నాటికి రిటైర్డ్ ఉద్యోగుల పెన్షన్ కూడా పెరుగుతున్న‌ది. గ్రాట్యూటీని రూ.12 లక్షల నుంచి రూ.16 లక్షలకు పెంచారని, వీటిని పింఛన్‌దారులకు చెల్లించాలి.
ఏప్రిల్ 1, 2020 నుంచి మార్చి 31, 2021 వరకు ఉన్న బకాయిలను 36 వాయిదాలలో చెల్లిస్తామని ప్రభుత్వం గతంలో ప్రకటించిన‌ది. తాజా ఈ జీవో ప్రకారం పింఛనుదారులకు పింఛను, గ్రాట్యుటీ బకాయిలు ఫిబ్రవరి 1వ తేదీ నుంచి అందజేస్తామని వివ‌రించింది.  2020 ఏప్రిల్ 1 తరువాత‌ మరణించిన పింఛన్ దారుల కుటుంబాలకు ఫిబ్రవరి 1న బకాయిలు చెల్లిస్తాం అని ప్రభుత్వం జీవోలో పేర్కొంది. జనవరి పెన్షన్‌తో సహా ఒక్కో పింఛన్ దారునికి రూ.1.5 లక్షల నుంచి రూ.3 లక్షల వరకు అదనంగా పింఛన్ ల‌భించ‌నున్న‌ది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: