నేడు హైదరాబాద్ కు రైతు సంఘం నేత రాకేష్ టికాయత్!

N ANJANEYULU
మూడు వ్య‌వ‌సాయ చ‌ట్టాల‌ను ర‌ద్దు చేయాల‌ని.. పార్ల‌మెంట్ లో ర‌ద్దు చేస్తూ బిల్లు పెట్టాలని డిమాండ్ చేస్తూ ఇవాళ హైద‌రాబాద్ న‌గ‌రంలో మ‌హాధ‌ర్నా నిర్వ‌హించ‌నున్నారు. రైతు ఉద్య‌మానికి ఇవాళ‌టికి సంవ‌త్స‌ర కాలం పూర్త‌వ్వ‌డంతో అఖిల భార‌త రైతు పోరాట స‌మ‌న్వ‌య స‌మితి, సంయుక్త కిసాన్ మోర్చా పిలుపు మేర‌కు ఇవాళ ఇందిరా పార్కు వ‌ద్ద ధ‌ర్నా జ‌రుగ‌నున్న‌ది. అయితే ముఖ్య అతిథిగా రైతు ఉద్య‌మ నాయ‌కుడు రాకేష్ టికాయ‌త్ హాజ‌రు కానున్నారు.
ఇవాళ ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం  4 గంటల వరకు ఈ మహాధర్నా కొన‌సాగుతుంది. ఈ ధర్నాకు తెలంగాణ నుంచి  పెద్ద ఎత్తున రైతులు కదిలిరావాలని రైతు సంఘాలు ఇప్పటికే పిలుపునిచ్చాయి.  మూడు వ్యవసాయ చట్టాల రద్దు బిల్లుతో పాటు, మద్దతు ధర హామీ బిల్లును పార్లమెంటులో తీసుకురావాలని రైతుల సంఘాలు డిమాండ్ చేసాయి. మరో వైపు కేంద్రం రైతు బిల్లులను రద్దు చేసుకునే తీర్మాణాన్ని నిన్న క్యాబినెట్ భేటీలో ఆమోదించిన‌ది.  ఈనెల 29న ప్రారంభమయ్యే శీతాకాల సమావేశాల్లో ఈ బిల్లును ప్రవేశపెట్టనున్న‌ట్టు వెల్ల‌డించారు. బిల్లు ఆమోదించే దాకా నిరసనలను కొనసాగిస్తామని రైతు సంఘాలు పేర్కొంటున్నాయి.  ఆ త‌రువాత‌నే ఇండ్ల వ‌ద్ద‌కు చేరుకుంటాం అని ఇప్ప‌టికే రైతులు స్ప‌ష్టం చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: