ఇక‌పై ఆన్‌లైన్‌లోనే సినిమా టికెట్ల విక్ర‌యం

N ANJANEYULU
పెద్ద సినిమాల‌కు ఏపీ ప్ర‌భుత్వం బిగ్ షాక్ ఇచ్చింది. ఏపీలో బెనిఫిట్ షోల‌ను ర‌ద్దు చేసిన‌ది ప్ర‌భుత్వం.  కొత్త చ‌ట్టం తీసుకురావ‌డంతో జీవో 35 ప్ర‌కారం అనుమ‌తి త‌ప్ప‌నిస‌రి తీసుకుంటే బెనిఫిట్‌షోలు ప్ర‌ద‌ర్శించ‌వ‌చ్చ‌ని మంత్రి పేర్నినాని వెల్ల‌డించారు. ఇవాళ అసెంబ్లీలో  సినిమాటోగ్రఫీ చట్టం సవరణల బిల్లును రాష్ట్ర మంత్రి పేర్ని నాని  ప్రవేశ పెట్టారు. అన్ని సినిమాల‌కు ఒకే టికెట్ రేటు ఉంటుంద‌ని మంత్రి పేర్నినాని స్ప‌ష్టం చేశారు. టికెట్ల రేట్ల నియంత్ర‌ణ‌తో పెద్ద సినిమాల‌పై తీవ్ర ప్ర‌భావం ప‌డనుంద‌ని ప‌లువురు పేర్కొంటున్నారు. ఆర్ఆర్ఆర్, ఆచార్య‌, బీమ్లానాయ‌క్  వంటి పెద్ద సినిమాల‌కు  కొత్త చ‌ట్టం ఎఫెక్ట్ అవ్వ‌నుంద‌ని టాక్ వినిపిస్తోంది.
 ఏపీలో సినిమాల‌కు నాలుగు షోల‌కుమాత్ర‌మే అనుమ‌తి ఉంటుంది. పెద్ద సినిమాల‌కు కొత్త చ‌ట్టం ప్ర‌బావం ప‌డ‌నుంది. సినిమాటోగ్ర‌ఫి చ‌ట్టం తీసుకొచ్చింది. బ‌స్సు, రైలు, విమానం టికెట్ల మాదిరిగానే సినిమా టికెట్లు ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవ‌చ్చు. ఆన్‌లైన్‌లో టికెట్ కొనుక్కోకుండా నేరుగా టికెట్ థియేట‌ర్ లో తీసుకున్న‌ట్ట‌యితే ఆ టికెట్‌ను థియేట‌ర్ యాజ‌మాన్యం త‌ప్ప‌నిస‌రిగా ఆన్‌లైన్‌లో న‌మోదు చేయాల‌ని స్ప‌ష్టం చేశారు మంత్రి పేర్ని నాని. రాజ‌కీయ పార్టీలు చేస్తున్న గొడ‌వ మాత్ర‌మేన‌ని, సినిమా వాళ్ల‌కు ఏమి ఎఫెక్ట్ ఉండ‌ద‌ని ప్ర‌భుత్వం స్ప‌ష్టం చేస్తోంది. అన్ని సినిమాల‌కు ఒకే రేటు ఉంటుంద‌ని ఏపీ ప్ర‌భుత్వం ఓ క్లారిటీ ఇచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: