సీఎం జ‌గ‌న్ ప్ర‌క‌ట‌పై అంద‌రి ఆస‌క్తి

N ANJANEYULU
మూడు రాజ‌ధానుల ప్ర‌క‌ట‌న‌పై కాసేప‌ట్లోనే ఏపీ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి కీల‌క ప్ర‌క‌ట‌న చేయ‌నున్నారు. ఇప్ప‌టికే రాజ‌ధానిపై  కొత్త చ‌ట్టాన్ని ప్ర‌వేశ‌పెట్టింద‌ని టాక్ వినిపిస్తోంది. అసెంబ్లీలో సీఎం ప్ర‌క‌ట‌న త‌రువాత క్యాబినెట్ నిర్ణ‌యాన్ని మెమోద్వారా హై కోర్టులో 2.15కు స‌మ‌ర్పించ‌నున్నారు.
హై కోర్టులో మెమో రూప‌కంగా ఇవ్వాల‌ని హై కోర్టు సూచించిన‌ట్టు ఏజీ తెలిపారు. రాజ‌ధానిపై అధ్య‌యానికి జీఎస్ రావు క‌మిటీ ఏర్పాటు చేశారు. అది నివేదిక‌ను కూడా ఇచ్చింది.  అదేవిధంగా హై ప‌వ‌ర్ క‌మిటీకి కూడా ఏపీ ప్ర‌భుత్వం నివేదిక‌ను స‌మ‌ర్పించింది. న్యాయ రాజ‌ధానిపై క‌ర్నూలు భ‌విష్య‌త్ ఏమిట‌నేదానిపై ఆస‌క్తి నెల‌కొన్న‌ది. ముఖ్యంగా అమ‌రావ‌తి, విశాఖ రెండు రాజ‌ధానులుగా కొన‌సాగే అవ‌కాశం క‌నిపిస్తుంద‌ని స‌మాచారం. మూడు రాజ‌ధానుల అంశం పూర్తిగా ర‌ద్దు చేస్తారా లేక రెండు రాజ‌ధానులు ప్ర‌వేశ‌పెట్ట‌నున్నారా అని సీఎం జ‌గ‌న్ అసెంబ్లీలో ప్ర‌వేశ‌పెట్టే కొత్త చ‌ట్టం పై అంద‌రూ ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: