ఏపీ క్యాబినెట్ అత్య‌వ‌స‌ర స‌మావేశం

N ANJANEYULU
 వ‌ర‌ద‌ల కార‌ణంగా అసెంబ్లీ స‌మావేశాలు నిర్వ‌హించాలా వ‌ద్దా అని   ఏపీ క్యాబినెట్ అత్య‌వ‌స‌ర స‌మావేశం  నిర్ణయించ‌నున్న‌ది. స‌మీక్ష‌లో ఎలాంటి నిర్ణ‌యాలు తీసుకోన్న‌దంటే.. ముఖ్య‌మంత్రి అధ్య‌క్ష‌త‌న స‌మావేశం కొన‌సాగుతొంది. స‌మావేశానికి వివిధ కార్య‌ద‌ర్శులు హాజ‌రు అయ్యారు.  జిల్లాల‌లో క‌డ‌ప‌, నెల్లూరు, అనంత‌పురం, చిత్తూరు వ‌ర‌ద ప‌రిస్థితుల‌పై స‌మీక్ష స‌మావేశం నిర్వ‌హిస్తున్నారు.
ప్ర‌తీ జిల్లాకు సంబంధించి ప్ర‌త్యేక అధికారుల‌ను ప్ర‌భుత్వం నిర్ణ‌యించిన‌ది. మ‌రోవైపు అసెంబ్లీ స‌మావేశాలు కొన‌సాగుతున్న నేప‌థ్యంలో మంత్రులు, ఎమ్మెల్యేల‌ను హాజ‌రు కాకుండా ప‌రిస్థితుల‌ను ఎలా ప‌రిష్క‌రించాల‌ని అధికారుల‌తో స‌మ‌న్వ‌యం చేసుకోవాల‌ని సూచించారు. అధికారుల‌కు ముఖ్య‌మంత్రి దిశానిర్దేశం చేయ‌నున్నారు. అత్య‌వ‌స‌ర క్యాబినెట్ స‌మావేశంలో కొన్ని కీల‌క నిర్ణ‌యాలు తీసుకోనున్నారు. ఈనెల 26 వ‌ర‌కు కొన‌సాగించాల్సిన శాస‌న స‌భ‌ను వాయిదా వేస్తారా.. లేక కొన‌సాగిస్తారా అనేది తెలియ‌నున్న‌ది. ఇప్ప‌టికే టీడీపీ నేత‌లు కూడా శాస‌న‌స‌భ‌కు హాజ‌రు కావ‌ద్ద‌ని నిర్ణ‌యం తీసుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: