చంద్రబాబుకు సోనూసూద్ ఫోన్..!

N ANJANEYULU
ఆంధ్ర‌ప్ర‌దేశ్ అసెంబ్లీలో టీడీపీ అధినేత చంద్ర‌బాబునాయుడు కంట‌త‌డి పెట్టుకున్న విష‌యం విధిత‌మే. ఈ త‌రుణంలో ప‌లువురు ప్ర‌ముఖులు చంద్ర‌బాబుకు సానుభూతి ప్ర‌క‌టిస్తున్నారు. చంద్ర‌బాబుకు ఇప్ప‌టికే త‌మిళ సూప‌ర్ స్టార్ ర‌జినికాంత్ ఫోన్ చేసి త‌న‌ మ‌ద్ద‌తు తెలిపారు. తాజాగా  హెల్పింగ్ స్టార్ సోనుసూద్ కూడా ఫోన్ చేసి టీడీపీ అధినేత‌తో మాట్లాడారు.
ఇటీవ‌ల అసెంబ్లీలో జ‌రిగిన ఘ‌ట‌న గురించి ఫోన్‌లో సంభాషించారు సోను. శాస‌న‌స‌భ‌లో జ‌రిగిన ఘ‌ట‌న దుర‌దృష్ట‌క‌రం అని వ్యాఖ్యానించారు. దేవాల‌యం లాంటి స‌భ‌లో వైసీపీ నేత‌ల వైఖ‌రి స‌రికాదు అని త‌న అభిప్రాయం వ్య‌క్త‌ప‌రిచాడు. తాను హైద‌రాబాద్ వ‌చ్చిన‌ప్పుడు త‌ప్ప‌కుండా క‌లుస్తాన‌ని చంద్ర‌బాబుకు సోనుసూద్ ఫోన్ లో చెప్పారు.
గ‌తంలో చంద్ర‌బాబుపై సోనుసూద్ ప్ర‌శంస‌లు కురిపించిన విష‌యం తెలిసిన‌దే. క‌రోనా బాధితుల‌కు ఎన్టీఆర్ ట్ర‌స్ట్ ద్వారా స‌హాయం చేస్తున్న స‌మ‌యంలో నిర్వ‌హించిన వ‌ర్చువ‌ల్ స‌మావేశంలో సోనుసూద్ చంద్ర‌బాబును అభినందించారు. హైద‌రాబాద్ న‌గ‌రం అభివృద్ధితో పాటు ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ అభివృద్ధిలో చంద్ర‌బాబు పాత్ర‌ను తాను ప్ర‌త్య‌క్షంగా చూసాన‌ని గ‌తంలో సోనుసూద్ వ్యాఖ్యానించిన విష‌యం విధిత‌మే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: