వరద బాధిత కుటుంబాలకు జగన్ శుభవార్త..!

N ANJANEYULU
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని వ‌ర‌ద బాధిత కుటుంబాల‌కు సీఎం జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి శుభ‌వార్త అందించారు. వ‌ర‌ద ప్ర‌భావిత జిల్లాల‌లో నిత్య‌వ‌స‌ర స‌రుకులు పంపిణీకి ప్ర‌భుత్వ అధికారులు ప్ర‌త్యేక చ‌ర్య‌లు తీసుకోవాల‌ని జ‌గ‌న్ ఆదేశాలు జారీ చేసారు. వ‌ర‌ద బాధిత కుటుంబాల‌కు 25 కేజీల బియ్యం, కేజీ కందిపప్పు, లీట‌ర్ వంట‌నూనె, కేజీ ఉల్లిగ‌డ్డ‌లు, కేజీ బంగాళ‌దుంప‌లు ఉచితంగా స‌ర‌ఫ‌రా చేయాల‌ని సీఎం అధికారుల‌ను ఆదేశించారు.
భారీ వ‌ర్షాల‌తో అత‌లాకుత‌లం అవుతున్న ముఖ్యంగా రాష్ట్రంలోని చిత్తూరు, నెల్లూరు, క‌డ‌ప‌, అనంత‌పురం జిల్లాల‌లోని వ‌ర‌ద బాధితుల‌కు ఉచిత స‌హాయం అంద‌నున్న‌ది. వ‌ర‌ద ప్ర‌భావిత ప్రాంతాల్లో ఇప్ప‌టికే స్థానిక ప్ర‌జాప్ర‌తినిధులు ప‌ర్య‌టించాల‌ని జ‌గ‌న్ ఆదేశించిన విష‌యం విధిత‌మే. ఆయా నియోజ‌క‌వ‌ర్గాల‌కు చెందిన ఎమ్మెల్యేలు అసెంబ్లీ స‌మావేశాల‌కు హాజ‌రుకావాల్సిన అవ‌స‌రం లేద‌ని సీఎం సూచించారు. ప్ర‌జ‌ల‌కు త‌క్ష‌ణ స‌హాయం అందేవిధంగా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని చెప్పారు. అదేవిధంగా వ‌ర‌ద‌ల కార‌ణంగా జ‌రిగిన ఆస్తిన‌ష్టం, పంట న‌ష్టంపై అంచెనాల‌ను ప్ర‌భుత్వానికి అధికారులు అందించాల‌ని సూచించారు. మ‌రోవైపు వ‌ర్షాల వ‌ల్ల దెబ్బ‌తిన్న రైతులు తిరిగి పంట‌లు వేసుకునేలా వాళ్ల‌కు విత్త‌నాల‌ను అందేలా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఆదేశించారు సీఎం జ‌గ‌న్‌.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: