పెన్నా సిమెంట్ ఫ్యాక్ట‌రీలో అగ్నిప్ర‌మాదం

N ANJANEYULU
ఆంధ్ర‌ప్ర‌దేశ్ లోని అనంత‌పురం జిల్లా యాడికి మండ‌లం బోయిరెడ్డిపల్లెలోని పెన్నా సిమెంట్ ఫ్యాక్ట‌రీలో అగ్ని ప్ర‌మాదం చోటు చేసుకొంది. పెన్నా సిమెంట్ ఫ్యాక్ట‌రీ కోల్‌మిల్ వెనుక బాగంలో ఒక్క‌సారిగా ఆదివారం మంట‌లు చెల‌రేగాయి. బొగ్గుతో మండే గొట్టం వేడి పెర‌గ‌డం మూలంగానే ఈ పేలుడు సంభవించిన‌ట్టు తెలుస్తున్న‌ది.
ఉన్న‌ట్టుండి ఒక్క‌సారిగా  ఒక ప్లాంట్‌లోని 5వ అంత‌స్తులో   కోల్డ్ మిల్ బాయిల‌ర్ వ‌ద్ద‌ మంట‌లు చెల‌రేగాయి. దాదాపు 100 అడుగుల మేర‌కు మంట‌లు ఎగిసిప‌డుతున్నాయి. ఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకున్న ఫైర్‌సిబ్బంది మంట‌లను అదుపు చేసేందుకు ప్ర‌య‌త్నం చేస్తున్నారు. పేలుడు సంభ‌వించిన స‌మ‌యంలో కార్మికులు టీ బ్రేకుకు వెళ్లడంతో పెను ప్ర‌మాదం త‌ప్పిన‌ది. అయితే టెక్నిక‌ల్‌ప్రాబ్ల‌మ్ లేదా విద్యుత్‌ షాక్ స‌ర్క్యూట్ కార‌ణంగా ప్ర‌మాదం చోటు చేసుకుంద‌ని భావిస్తున్నారు. సంచ‌ల‌నంగా మారింది. అగ్నిప్ర‌మాదం చోటు చేసుకున్న విష‌యాన్ని తెలుసుకున్న కార్మికుల కుటుంబ స‌భ్యులు భ‌య‌బ్రాంతుల‌కు గుర‌య్యారు. కొంద‌రూ ఏకంగా ఫ్యాక్ట‌రీ వ‌ద్ద‌కే చేరుకున్నారు. ఎలాంటి ప్రాణ న‌ష్టం జ‌ర‌గ‌క‌పోవ‌డంతో ఊపిరి పీల్చుకున్నారు. స‌రైన భ‌ద్ర‌తా ప్ర‌మాణాలు పాటించ‌క‌పోవ‌డంతోనే అగ్నిప్ర‌మాదం జ‌రిగింద‌ని ప‌లువురు ఆరోపిస్తున్నారు. రెండేండ్ల కింద‌ట కూడా పెన్నా సిమెంట్ ఫ్యాక్ట‌రీలో బాయిలర్ పేలిపోవడంతో ప్ర‌మాదం చోటు చేసుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: