తమిళనాడులో భారీ వర్షాలు
ప్రజలను బయటికి వెళ్ల వద్దని ప్రభుత్వం సూచించింది ఇప్పటికే. నిన్న ముఖ్యమంత్రి స్టాలిన్ ఏకంగా మూడు రోజుల పాటు ఎవరూ కూడ చెన్నైకి రావొద్దని, చెన్నై నుంచి వర్షం తగ్గే వరకు ఎవరు బయటికి వెళ్లోద్దని సూచనలు కూడ చేసారు. ఇప్పటికే రైల్వే లైన్ పై నీరు నిలవడంతో చెన్నైలో లోకల్ రైళ్లను రద్దు చేశారు. అదేవిధంగా ఏయిర్‌ఫోర్ట్‌లో విమానాల రన్‌వేలు చెరువులా తలపిస్తున్నాయి. చాలా వరకు విమానాలు ఎక్కడివక్కడ నిలిచిపోయాయి. నిన్న ప్రధాని నరేంద్రమోడీ సీఎం స్టాలిన్‌కు ఫోన్ చేసి తమిళనాడులో వర్షం ప్రభావంపై అడిగి తెలుసుకున్నారు. కేంద్రం సహాయం చేస్తుందని సీఎంకు వివరించారు మోడీ.