ఎమ్మెల్యేలు స్వయంగా డబ్బులు పంచి వెళ్లారు : ఈటెల
అందరూ ఏకపక్షంగా వ్యవహరించారని..ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసే పద్దతిలో అధికార పార్టీ వ్యవహరించిందని ఈటెల ఆగ్రహం వ్యక్తం చేశారు. డబ్బులు పెట్టి గెలిచే పద్దతి మంచిది కాదని ఆయన అన్నారు. ఎమ్మెల్యే లు స్వయంగా డబ్బులు పంచి వెళ్లారని.. బస్లలో ఇవిఎం కూడా మార్చినట్టు వార్తలు వస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. నన్ను ఓడించడానికి కెసిఆర్ గారు అన్ని ప్రయత్నాలు చేశారని ఈటెల వ్యాఖ్యానించారు.