ఎం.ఎల్ ఏ జంప్ జిలాని ఎక్కడంటే...?

పశ్చిమ బెంగాల్‌లోని ఉత్తర దినాజ్‌పూర్ జిల్లా రాయ్‌గంజ్‌కు చెందిన భారతీయ జనతా పార్టీ (బిజెపి) ఎమ్మెల్యే కృష్ణ కళ్యాణి తృణమూల్ కాంగ్రెస్ (టిఎంసి)లో చేరారు. రాయ్‌గంజ్‌కు చెందిన బీజేపీ ఎంపీ, కేంద్ర మాజీ మంత్రి దేబాశ్రీ చౌధురి తనపై కుట్ర పన్నేందుకు ప్రయత్నిస్తున్నారని కృష్ణ కళ్యాణి ఆరోపించారు. బీజేపీ ఎంపీగా ఉన్న అదే పార్టీలో నేను పనిచేయలేనని కళ్యాణి తెలిపారు. "బిజెపిలో మంచి ప్రజాసేవకు అవకాశం లేదు. ప్రజల కోసం నిజమైన పని చేస్తున్న ఏకైక వ్యక్తి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ" అని ఆయన అన్నారు.
తాజాగా బీజేపీ ఎమ్మెల్యే రాజీనామా చేయడంతో బెంగాల్ అసెంబ్లీలో ఆ పార్టీ సంఖ్య 70కి పడిపోయింది. వాస్తవానికి బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ   77 సీట్లు  సాధించుకుంది. కాని తమ ఎం.ఎల్ ఏలను కట్టడి చేయడం లో  ఆ పార్టీ విఫలమవుతోంది.  తాజాగా మరో ఎం,ఎల్ ఏ పార్టీని వీడడం పై బి.జె.పి నేతలు ఎవరూ స్పందించ లేదు. గత నెలలో   ఐదు రోజుల్లో ముగ్గురు ఎం.ఎల్ ఏలు భారతీయ జనతా పార్టీని వీడారు. ఆ రాష్ట్రంలో అధికారంలో ఉన్న తృణముల్ కాంగ్రెస్ లో చేరారు. తాజాగా  కృష్ణ కళ్యాణి  పార్టీని వీడటంతో భారతీయ జనతా పార్టీ  ఏడుగురు సభ్యులను కోల్పోయినట్లయింది.


మరింత సమాచారం తెలుసుకోండి:

bjp

సంబంధిత వార్తలు: