ఎస్సీ వర్గీకరణకు ప్రయత్నం: కిషన్‌రెడ్డి

N.Hari
ఎస్సీ వర్గీకరణకు కేంద్ర ప్రభుత్వానికి నేతృత్వం వహిస్తున్న బీజేపీ ప్రయత్నం చేస్తోందని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. ఎమ్మార్పీఎస్‌ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగను ఆయన కలిశారు. తాను కేంద్రమంత్రిగా రాలేదనీ, ఎమ్మార్పీఎస్‌ శ్రేయోభిలాషిగా వచ్చానని కిషన్‌రెడ్డి అన్నారు. ఎమ్మార్పీఎస్‌తో కలిసి చాలా పోరాటాలు చేశానని చెప్పారు. తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అప్పటి ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి- "నీకు, ఎమ్మార్పీఎస్‌కు సంబంధం ఏమిటి?" అని తనను ప్రశ్నించినట్లు కిషన్‌రెడ్డి వెల్లడించారు.

పార్లమెంటులో చట్టం ద్వారా ఎస్సీ వర్గీకరణ జరగాలని మందకృష్ణ మాదిగ పెట్టిన డిమాండ్‌ను వెరవేర్చేందుకు ప్రయత్నం జరుగుతోందనీ, తన మిత్రులు నారాయణస్వామి, మురుగన్‌తో కలిసి వర్గీకరణ కోసం తన ప్రయత్నాన్ని కొనసాగిస్తానని కిషన్‌రెడ్డి తెలిపారు. తమ పార్టీ ఎస్సీ వర్గీకరణ కోసం తీర్మానం చేసిన విషయాన్ని కోర్టు తీర్పు అనుకూలంగా రావాలని కోరుకుంటున్నాననీ, ఎస్సీ వర్గీకరణ కోసం తాను కట్టుబడి ఉన్నాననీ ఆయన స్పష్టం చేశారు. భవిష్యత్తులో ఏ ఉద్యమం చేసినా ఎమ్మార్పీఎస్‌కు తాను అండగా ఉంటానని కిషన్‌రెడ్డి అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: