బ్రేకింగ్‌: పట్టాభికి బెయిల్ మంజూరులో ట్విస్టులు

VUYYURU SUBHASH
టీడీపీ నేత కొమ్మారెడ్డి ప‌ట్టాభికి హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డిని ప‌ట్టాభి బోస్ డీకే అన్న ప‌దంతో పాటు ప‌లు ప‌దాలు ఉప‌యోగించి విమ‌ర్శ‌లు చేశారు. అయితే బోస్ డీకే అన్న ప‌దం తీవ్ర అభ్యంత‌ర క‌రంగా ఉంద‌న్న విమ‌ర్శ‌లు వైసీపీ వ‌ర్గాల నుంచి వినిపించాయి. దీనిపై పెద్ద ఎత్తున వాదోప వాదాలు జ‌రిగాయి. చివ‌ర‌కు మంగ‌ళ‌గిరి లో ఉన్న టీడీపీ కేంద్ర కార్యాల‌యంపై సైతం దాడులు జ‌రిగాయి. చివ‌ర‌కు పోలీసులు కేసు న‌మోదు చేసి ప‌ట్టాభి ఇంటికి వెళ్లి మ‌రీ అరెస్టు చేశారు. సీఎం జగన్‌పై పరుష పదజాలం ఉపయోగించార‌న్న కార‌ణం తో ప‌ట్టాభి పై క్రైం నం.352/2021తో ఐపీసీ 153(ఎం), 505(2), 353, 504 రెడ్‌విత్‌ 120(బి) సెక్షన్ల కింద విజ‌య వాడ‌లోని గవర్నరుపేట పోలీస్‌స్టేషన్‌లో కేసు లు పెట్టారు.
ఆ త‌ర్వాత పోలీసులు ప‌ట్టాభి ఇంటికి వెళ్లి త‌లుపులు ప‌గ‌ల గొట్టి మ‌రీ ఆయ‌న్ను అరెస్టు చేశారు. ఈ క్ర‌మంలోనే టీడీపీ వాళ్లు ప‌ట్టాభి బెయిల్ కోసం హైకోర్టులో పిటిష‌న్ వేశారు. ఈ రోజు బెయిల్ పిటిష‌న్ పై వాదోప వాదాలు ముగిశాయి. ఎట్ట‌కేల‌కు ఈ రోజు హైకోర్టు ఇరు వైపులా వాద‌న‌లు విన్న అనంత‌రం ప‌ట్టాభి కి బెయిల్ మంజూరు చేసింది. సెక్ష‌న్ 41 ఏ కింద నోటిసుల‌పై పోలీసులు కింది కోర్టు సూచ  న‌ల‌ను సైతం హైకోర్టు ప‌రిగ‌ణ లోకి తీసుకుని మ‌రీ బెయిల్ మంజూరు చేసింది.
ప్ర‌స్తుతం ప‌ట్టాభి రాజ‌మండ్రి లోని కేంద్ర కర్మాగారంలో జైలు శిక్ష అనుభ‌విస్తున్నారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర ఉద్రిక్త‌ల‌కు కార‌ణ‌మైన ఈ కేసులో ప‌ట్టాభి కి బెయిల్ మంజూరు కావ‌డంతో టీడీపీ నేత‌లు రాష్ట్ర వ్యాప్తంగా హ‌ర్షం వ్య‌క్తం చేస్తున్నారు. ఇక బెయిల్ మంజూరు సంద‌ర్భంగా జ‌డ్జి పోలీసుల‌కు సైతం వార్నింగ్ ఇచ్చారు. పోలీసులు ఓవరాక్షన్ తగ్గించుకోవాలన్న జడ్జి సూచించారు. అలాగే
41 సీఆర్పీసీ సమాధానం రాకుండానే ఎందుకు అరెస్టు చేసారని   హైకోర్టు ప్ర‌శ్నించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: