ఐ సపోర్ట్ ప్రెసిడెంట్ రూల్, డీజీపీ అంత బిజీగా ఉన్నాడా: చంద్రబాబు

రౌడీయిజం చేస్తే బెదురుతామని భావించవద్దు అంటూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు హెచ్చరించారు. మాకు మాట్లాడే స్వేచ్ఛ లేదా..? అని ఆయన నిలదీశారు. ఇది నా కోసం చేసే పోరాటం కాదు అన్న ఆయన... బంద్ కు సహకరించడం ద్వారా ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని కోరుకుంటున్నాం అని విజ్ఞప్తి చేసారు. సీఎం, డీజీపీ  కుమ్మక్కై చేసిందే ఈ దాడి చేసారని  చంద్రబాబు నాయుడు  అన్నారు.
నేను ఫోన్ చేస్తే డీజీపీ ఫోన్ ఎత్తరా..? అని  చంద్రబాబు నాయుడు  ప్రశ్నించారు. గవర్నర్, కేంద్ర మంత్రి ఫోన్లు ఎత్తుతారు కానీ.. డీజీపీ ఫోన్ ఎత్తలేనంత బీజీనా..? అని ప్రశ్నించారు. నేనెప్పుడూ రాష్ట్రపతి పాలనను సపోర్ట్ చేయలేదు.. కానీ ఇంతకంటే దారుణం ఏముంటుంది..? అని అన్నారు. రాష్ట్రపతి పాలన పెడితే తప్పేంటీ అని అనిపిస్తోంది అన్నారు ఆయన. రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని ఏ విధంగా పరిరక్షిస్తారనేదే ప్రధాన సమస్య.. అందుకే కేంద్ర మంత్రికి ఫోన్ చేశాను అని దాడి జరుగుతున్నప్పుడే డీజీపీకి ఫోన్ చేశాను అని తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: