వెయ్యి బైక్ సైలెన్సర్ లను హైదరాబాద్ పోలీసులు ఏం చేసారో తెలుసా...?

నేడు 1000 బైక్ సైలెన్సర్ లను రోడ్డు రోలర్ తో ధ్వంసం చేయడం జరిగింది అన్నారు హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్. వాహనానికి సంబంధించిన హారన్ సౌండ్, సైలెన్సర్ గాని ఏ విధంగా ఉండాలి అనేది రీసెర్చ్ చేసిన తర్వాత బైక్ ను మ్యానుఫ్యాక్చర్ చేస్తారు అని ఆయన పేర్కొన్నారు. సౌండ్ పొల్యూషన్ చేస్తూ రోడ్లపై యువకులు బైక్ రేసింగ్ పాల్పడుతూ తిరుగుతున్నారు అని ఆయన వ్యాఖ్యానించారు.
రోడ్లపై వెళ్లే వారికి ఈ సౌండ్ పొల్యూషన్ వల్ల అనారోగ్యానికి గురయ్యే హార్ట్ స్ట్రోక్ వచ్చే అవకాశం ఉంది అని తెలిపారు. ట్రాఫిక్ రూల్స్ ప్రతిఒక్కరు పాటించాలి అని స్పష్టం చేసారు. వరుసగా ట్రాఫిక్ ఉల్లంఘనకు పాల్పడితే డ్రైవింగ్ లైసెన్స్ ను క్యాన్సల్ చేయిస్తాం అన్నారు. మెట్రో నగరాన్ని ఇమేజ్ ఏ మాత్రం తగ్గకుండా మనం అందరం సౌండ్ పొల్యూషన్ కంట్రోల్ చేసేలా భాగస్వాములం అవుదాం అని సూచించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

ts

సంబంధిత వార్తలు: