హుజూరాబాద్ ఉపఎన్నిక‌.. దానికి బ్రేక్‌..!

N ANJANEYULU
తెలంగాణ రాష్ట్రంలో హుజూరాబాద్ ఉప ఎన్నిక‌కు నోటిఫికేష‌న్ వేసిన విష‌యం తెలిసిందే. ఈనెల 30న ఎన్నిక‌లు జ‌రుగ‌నున్న నేప‌థ్యంలో కేంద్ర ఎన్నిక‌ల సంఘం ఒక కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. రాష్ట్ర ప్ర‌భుత్వం ప్ర‌తిష్టాత్మ‌కంగా ప్ర‌వేశ‌పెట్టిన ద‌ళిత‌బంధు ప‌థ‌కానికి బ్రేక్ వేసింది.  ఉపఎన్నిక జ‌రుగుతున్న త‌రుణంలో ద‌ళిత బంధు ప‌థ‌కాన్ని నిలిపి వేయాల‌ని ఎన్నిక‌ల క‌మిష‌న్ ఆదేశించింది.  ఈ మేర‌కు రాష్ట్ర ఎన్నిక‌ల ప్ర‌ధాన అధికారికి కేంద్ర ఎన్నిక‌ల సంఘం ఓ లేఖ రాసింది.
తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ ద‌ళితుల అభివృద్ధి కోసం ఇది ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డుతుంద‌ని ప్ర‌క‌టించారు. ద‌ళిత‌బంధు కేవ‌లం ద‌ళితుల‌తోనే ఆగ‌ద‌ని.. గిరిజ‌నులు, బీసీల అభివృద్ధి సంక్షేమానికి ద‌శ‌ల‌వారిగా కృషిచేస్తాను. అంద‌రికీ ఒకే స్కీమ్ ప్ర‌వేశ‌పెట్ట‌డం ద్వారా పోటీ పెరుగుతుంద‌ని.. దీంతో ఇబ్బందులు ఎదుర‌వుతాయ‌ని వెల్ల‌డించాడు. ఆరునూరు అయినా ద‌ళిత బంధును విజ‌య‌వంతం చేయాల‌ని, ద‌ళిత స‌మాజానికే తెలంగాణ దారి చూపిస్తుంద‌ని కేసీఆర్‌ పేర్కొన్న కొద్ది గంట‌ల వ్య‌వ‌ధిలోనే బ్రేకు ప‌డింది. ప్ర‌తిప‌క్షాలు ఫిర్యాదు చేయ‌డంతో ఎన్నిక పూర్త‌య్యేంత వ‌ర‌కు ఈ ప‌థ‌కం అమ‌లు ఆపాల‌ని ఈసీ స్ప‌ష్టం చేసింది. రాష్ట్ర ప్ర‌భుత్వం ద‌ళిత‌బంధు ఫైల‌ట్ ప్రాజెక్ట్‌గా హుజూరాబాద్‌లోనే ఆవిష్క‌రించింది.    

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: