మోత్కుప‌ల్లిని పార్టీలోకి ఆహ్వ‌నించిన సీఎం కేసీఆర్

N ANJANEYULU
టీఆర్ ఎస్‌లో మోత్కుప‌ల్లి న‌ర్సింహులు టీఆర్ ఎస్ చేరారు.  సీఎం కేసీఆర్  గులాబీ కండువా క‌ప్పీ సాద‌రంగా పార్టీలోకి ఆహ్వ‌నించారు. ఈ సంద‌ర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడారు.  తెలంగాణ సాధ‌న‌లో అనేక ఆటుపోటులు ఎదుర్కొన్నాం. రైతు, చేనేత ఆత్మ‌హ‌త్య‌లు ఆగిపోయాయి. మోత్కుప‌ల్లి నాకు అత్యంత స‌న్నిహితులు అని ప్ర‌క‌టించాడు సీఎం కేసీఆర్‌. తెలంగాణ గురించి మాయావ‌తికి చెప్పాను. తెలంగాణ వ‌చ్చాక స‌మ‌స్య ప‌రిష్క‌రించుకున్నాం. కొన్ని వ‌ర్గాల‌కు కొన్ని ప‌నులు జ‌రిగాయి. మ‌రికొన్ని వ‌ర్గాల‌కు ఇంకా జ‌ర‌గాల్సి ఉంది.

 ఇత‌ర రాజ‌కీయ పార్టీలకు రాజ‌కీయ క్రీడ‌. టీఆర్ఎస్ ఒక టాస్క్‌. రాజ‌కీయం కోసం కాదు ల‌క్ష్యం కోసం ప‌ని చేస్తుంది. తెలంగాణ కోసం మాయావ‌తిని 13 సార్లు క‌లిశాం.  ద‌ళిత‌బంధు కాడ‌నే ఆగ‌దు. రాష్ట్రానికి సంప‌ద వ‌స్తే ఏదో ఒక రూపంలో ప్ర‌జ‌ల‌కు చేరుతుంది. ఎవ‌రికీ స‌మ‌స్య ఉందో వారికి ముందు స‌మ‌స్య‌లు తొల‌గిస్తాం. త‌రువాత మెల్ల‌గా అంద‌రి అభివృద్ధికి కృషి చేస్తాం.  ఏడేండ్ల కింద నేను నా ఊరు చెప్ప‌డానికి సిగ్గుప‌డ్డా. ఇప్పుడు చెప్ప‌డానికి గ‌ర్వ‌ప‌డుతున్నా అని పాట గురించి ప్ర‌స్తావించారు సీఎం.  మ‌హారాష్ట్ర, ఛ‌త్తీస్‌ఘ‌డ్ రాష్ట్రాల నాయ‌కులు తెలంగాణ‌లో క‌ల‌పాల‌ని కోరుతున్నారు. వారిని క‌లుపుకుంటే మ‌న రాష్ట్రం ఏమి అభివృద్ధి జ‌రుగుతుంద‌ని పేర్కొన్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: