కేటీఆర్ అధ్యక్షతన పార్టీ ప్లీనరీ సన్నాహక సమావేశాలు
ఆయా నియోజకవర్గంలో నాయకులకు, కిందిస్థాయి నాయకత్వానికి మధ్య సంబంధం ఏవిధంగా ఉందనే విషయంపై మంత్రి ఆరాతీశారు. ఇక నుంచి కిందిస్థాయి నుంచి పై స్థాయి వరకు అందరికీ అందుబాటులో ఉంటానని వెల్లడించారు మంత్రి. నియోజకవర్గంలో ఏ సమస్య ఉన్నా నేరుగా తనను కలవవచ్చని కోరారు. గ్రామస్థాయి నుండి రాష్ట్రస్థాయి వరకు పార్టీ అభివృద్ధి కోసం అందరూ కష్టపడి చేయాలని సూచించారు. ప్రతి ఊరి నుంచి వరంగల్‌కు తరలిరావాలని కేటీఆర్ పిలుపునిచ్చారు.