ఎల్లుండి నుండి షర్మిల "ప్రజా ప్రస్థానం"...గ్రామ గ్రామాణ మాటా ముచ్చట..!

వైటీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఎల్లుండి నుండి ప్రజా ప్రస్థాన పాదయాత్రను ప్రారంభించనున్నారు. పాదయాత్ర ఏర్పాట్ల పై లోటస్ పాండ్ లో రాష్ట్ర కార్యవర్గం తో ఈ మేరకు షర్మిల సమావేశం ఏర్పాటు చేశారు. షర్మిల చేవెళ్ళలో ఎల్లుండి ఉదయం 11 గంటలకు షర్మిల భారీ భహిరంగ సభ ను కూడా ఏర్పాటు చేయనున్నారు. సభ తరవాత పాదయాత్ర ప్రారంభించబోతున్నారు. 14 నెలల పాటు 4 వేల కిలోమీటర్లు, మొత్తం 90 నియోజక వర్గాల్లో షర్మిల పాదయాత్ర చేయనున్నారు. అంతే కాకుండా ప్రతి రోజు 12 కిలోమీటర్ల వరకు పాదయాత్ర చేసేలా షర్మిల కార్యాచరణ రూపొందించుకున్నారు. ఈ తరం యువతకు నవతరం న్యాయకత్వం అనే స్లోగన్ తో షర్మిల పాదయాత్ర ను చేపడుతున్నారు.

వైఎస్ ఆర్ సంక్షేమ పాలనే ఎజెండా గా షర్మిల పాదయాత్ర ను మొదలు పెడుతున్నారు. అంతే కాకుండా ప్రతి రోజు రచ్చ బండ మాదిరిగా మాట ముచ్చట కార్యక్రమం సైతం ప్లాన్ చేసారు. ప్రతి నియోజక వర్గంలో మూడు మండలాలు టచ్ చేసేలా రూట్ మ్యాప్ ను సైతం షర్మిల టీమ్ రూపొందించింది. ఇక పాదయాత్రలో షర్మిల పార్టీలో చేరికలు.. గ్రామాల వారీగా పార్టీ బలోపేతం పై సమావేశాలు నిర్వహించే ఆలోచనలో ఉన్నారు. ఉమ్మడి జిల్లాల వారీగా తన పాదయాత్ర లో  షర్మిల 9 భారీ భహిరంగ సభలు ఏర్పాటు చేసేలా నిర్ణయం తీసుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: