పెళ్లిపై ఓ క్లారిటీ ఇచ్చిన క‌త్రినా కైఫ్

N ANJANEYULU
బాలివుడ్ యువ‌హీరో విక్కికౌశ‌ల్‌, స్టార్ హీరోయిన్ క‌త్రినాకైఫ్ రెండేండ్లుగా ప్రేమ‌లో ఉన్న విష‌యం అందరికీ తెలిసిందే. వీరిద్ద‌రూ అప్పుడ‌ప్పుడూ సినిమాల‌కు, షికార్ల‌కు తిర‌గ‌డం.. ప‌లు ఫంక్ష‌న్‌ల‌కు క‌లిసి వెళ్ల‌డంతో అంద‌రికీ ప‌లు అనుమానాలు వ్య‌క్తం చేశారు. గ‌తంలో క‌త్రినా ల‌వ్ ఫెయిల్యూర్ చ‌విచూసింది.  అయితే వీరిద్దరి  ప్రేమ మ‌రి పెళ్లి పీట‌లెక్క‌నుందా అనుకున్నారు అంద‌రూ. కానీ ఆ వార్త‌ల‌కు విక్కీ కౌశ‌ల్‌ స్వ‌స్తీ చెప్పాడు.
ఈ మ‌ధ్య‌కాలంలో వీరు నిశ్చితార్థం చేసుకుంటార‌నే వార్త‌లు వినిపించాయి. వీటిని విక్కి సోద‌రుడు స‌న్నీకౌశ‌ల్ ఖండించాడు. తాజాగా విక్కికౌశ‌ల్ న‌టించిన స‌ర్ధార్ ఉద్ద‌మ్ సినిమా విడుద‌ల‌కు సిద్ధంగా ఉంది.
దీని ప్ర‌మోష‌న్స్ కోసం విక్కితో పాటు క‌త్రినా కూడ‌ హాజ‌రైంది. మీడియా విక్కికౌశ‌ల్‌ను పెళ్లి ఎప్పుడు చేసుకోనున్నార‌ని ప్ర‌శ్నించ‌గా స‌రైన ముహూర్తం చూసుకొని త్వ‌ర‌లో మేము నిశ్చితార్థం చేసుకుంటామ‌ని వెల్ల‌డించాడు.  మా నిశ్చితార్థంపై అన‌వ‌స‌ర ప్ర‌చారాలు చేయొద్ద‌ని, తానే స్వ‌యంగా అంద‌రికీ చెబుతాన‌ని స్ప‌ష్టం చేశారు విక్కికౌశ‌ల్‌.  క‌త్రినా కూడ ఒక క్లారిటీ ఇచ్చింది. విక్కీ మాటే త‌న మాట‌గా చెప్పింది క‌త్రినా. దీంతో వీరిద్ధ‌రూ వ‌చ్చే సంవ‌త్స‌రం పెళ్లి చేసుకోవ‌డం ఖాయ‌మ‌ని బాలివుడ్ వ‌ర్గాలు పేర్కొంటున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: